జగన్ పంతం వల్ల ఏపీ ప్రజలు నష్టపోతున్నారా.. ఏం జరిగిందంటే?

CM Jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్ కోర్టుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా మూడు రాజధానుల నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గడానికి ఇష్టపడటం లేదనే సంగతి తెలిసిందే. ఎవరేం అనుకున్నా తాను వెనుకడుగు వేయనని జగన్ భావిస్తున్నారు. అయితే జగన్ పంతం వల్ల నష్టపోతున్నది ఏపీ ప్రజలేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గడిచిన మూడున్నరేళ్లుగా ఏపీ ప్రజలకు రాజధాని లేని పరిస్థితి ఉంది.

జగన్ ఐదేళ్ల పాలన రాజధాని లేకుండా జరిగే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ పంతం వల్ల ఏపీ ప్రజలు నష్టపోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అమరావతి రైతులు రాజధాని విషయంలో వెనక్కు తగ్గడం లేదు. అయితే వాళ్లు అమరావతి రైతులు కాదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని చాలామంది భావిస్తుండటం గమనార్హం.

కోర్టు తీర్పులు అమరావతి రైతులకు అనుకూలంగా వస్తుండటంతో షాకవ్వడం జగన్ సర్కార్ వంతవుతోంది. జగన్ సర్కార్ పంతం వల్ల ఏపీలోని ఒక తరం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో పరిశ్రమలు స్థాపించాలని పలువురు పారిశ్రామికవేత్తలు భావిస్తున్నా ఈ విషయంలో జగన్ సర్కార్ కే క్లారిటీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొదట ఒక రాజధానిని అభివృద్ధి చేసి జగన్ సర్కార్ మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాజధాని విషయంలో జగన్ సర్కార్ తీరు మారాల్సి ఉంది. 2024 ఎన్నికలకు ఎంతో సమయం లేదు. జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసినా ఇప్పుడు మాత్రం ఈ విషయంలో ప్రజలు హ్యాపీగా లేరు. 2024 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావాలంటే రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.