ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రభంజనం కొనసాగింది. పార్టీల గుర్తులపై అభ్యర్థులు నిలవకపోయినా ఆయా పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అన్ని చోట్ల పోటీలో నిలబడ్డారు. అర్థరాత్రి వరకు కొనసాగిన ఈ కౌటింగ్ లో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.. చివరికి ఫలితాల్లో అధికార పార్టీ మద్దతుదారుల హవా కనిపించింది. ఓవరాల్ గా వైసీపీ మద్దతు దారులు 2567 మంది విజయం సాధించగా.. టీడీపీ మద్దతు దారులు 523 చోట్ల గెలుపొందారు.. బీజేపీ జనసేన కూటమి, ఇతర పార్టీలు 47 స్థానాలతో సరిపెట్టుకున్నాయి.. స్వతంత్య్ర అభ్యర్థులు 86 మంది విజయం సాధించారు.
గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖల్లో మాత్రం ప్రధాన ప్రతిపక్షం 50 సీట్లకు పైగా సాధించి రేసులో నిలిచింది. మిగిలిన అన్ని చోట్ల కనీసం అధికార పార్టీకి పోటీ ఇవ్వలేకపోయింది.. ఓవారల్ గా చూస్తే తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సైకిల్ కు పంక్చర్ అయ్యింది అనుకోవచ్చు.ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వగ్రామంలోనై వైసీపీ మద్దతుదారుల హవానే కొనసాగింది.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో సర్పంచ్, ఆయన నివాసం ఉన్న వార్డులోనూ వైసీపీ మద్దతు దారులే విజయం సాధించడం విశేషం. మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత ఊరు నిమ్మాడలో జరిగిన ఎన్నిక కూడా చాలా ఆసక్తి పెంచింది. 40 ఏళ్ల తరువాత ఇక్కడ ఎణ్నికలు జరిగ్గా టీడీపీ అభ్యర్థి కింజారపు సురేష్ 1700 ఓట్ల విజయం సాధించారు.
జిల్లాల వారీగా ఫలితాలు ఇలా ఉన్నాయి..
శ్రీకాకుళం :వైసీపీ మద్దతు దారులు 261, టీడీపీ మద్దతు దారులు 57, ఇతరులు 2
విశాఖ :వైసీపీ మద్దతు దారులు 254 టీడీపీ మద్దతు దారులు 56 ఇతరులు 30
తూర్పుగోదావరి : వైసీపీ మద్దతు దారులు 320 టీడీపీ మద్దతు దారులు 31 ఇతరులు 14
పశ్చిమగోదావరి : వైసీపీ మద్దతు దారులు 170 టీడీపీ మద్దతు దారులు 36 ఇతరులు 33
కృష్ణా : వైసీపీ మద్దతు దారులు 191 టీడీపీ మద్దతు దారులు 37 ఇతరులు 06
గుంటూరు : వైసీపీ మద్దతు దారులు 241 టీడీపీ మద్దతు దారులు 73 ఇతరులు 23
ప్రకాశం : వైసీపీ మద్దతు దారులు 163 టీడీపీ మద్దతు దారులు 58 ఇతరులు 06
కర్నూలు : వైసీపీ మద్దతు దారులు 162 టీడీపీ మద్దతు దారులు 31 ఇతరులు 00
అనంతపురం : వైసీపీ మద్దతు దారులు 143 టీడీపీ మద్దతు దారులు 26 ఇతరులు 00
కడప : వైసీపీ మద్దతు దారులు 160 టీడీపీ మద్దతు దారులు 22 ఇతరులు 00
నెల్లూరు : వైసీపీ మద్దతు దారులు 131 టీడీపీ మద్దతు దారులు 25 ఇతరులు 07
చిత్తూరు : వైసీపీ మద్దతు దారులు 370 టీడీపీ మద్దతు దారులు 75 ఇతరులు 09