నిమ్మగడ్డ రమేష్ కి ట్విస్ట్ ఇచ్చిన ఏపీ పోలీస్ శాఖ… ఇది జగన్ ప్రభుత్వానికి గిఫ్ట్ అంట!

Ap NGO's Given the twist to nimmagadda that their staff is not ready to take part in the election

ఆంధ్ర ప్రదేశ్: స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. కరోనా వైరస్ కేసుల నేపధ్యంలో రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించేందుకు లేదంటు ఏపిఎన్జీవో నేతలు స్పష్టంగా చెప్పారు. కరోనా కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించే పరిస్ధితులు రాష్ట్రంలో లేవని నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల నిర్వహించాలంటే ముందు భారం పడేది పోలింగ్ సిబ్బందిపైనే అన్న విషయాన్ని ఎన్జీవో నేతలు గుర్తుచేశారు.

లాక్ డౌన్ లో భాగంగా విధినిర్వహణలో సుమారు 11 వేల మంది పోలీసులు కరోనా వైరస్ బారిన పడిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అలాగే వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా వైరస్ భారిన పడ్డారని చెప్పారు. పోలీసులు,వివిధ ప్రభుత్వ ఉద్యోగుల్లో కొన్ని వందలమంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందేన్నారు.ఎన్నికల నిర్వహణ విషయంలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఒకవేళ తమ అభ్యంతరాలను కాదని ఎన్నికల నిర్వహణకే నిమ్మగడ్డ మొగ్గుచూపితే తాము కోర్టును ఆశ్రయిస్తామని కూడా నేతలు హెచ్చరించారు.

Ap NGO's Given the twist to nimmagadda that their staff is not ready to take part in the election
Ap NGO’s Given the twist to nimmagadda that their staff is not ready to take part in the election

ఎన్నికల కారణంగా కరోనా భారిన పడటానికి తమ ఉద్యోగుల్లో ఎవరు ఇష్టపడటం లేదన్నారు.ముఖ్యంగా రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న ఉద్యోగులు ఎన్నికల విధులంటేనే భయపడుతున్నట్లు నేతలు చెప్పారు. పోలీసులు, ఉద్యోగులు లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న విషయాన్ని నిమ్మగడ్డ గుర్తుంచుకోవాలని సూచించారు. పదవిలోనుండి దిగిపోయేలోగా ఎన్నికలను నిర్వహించేయాలన్న పంతానికి నిమ్మగడ్డ వెళితే తాము కూడా కోర్టులో కేసు వేస్తామని చెప్పారు. వ్యవహారం చూస్తుంటే ఎన్నికల నిర్వహణపై ఏపిఎన్జీవోలు కోర్టులో కేసు వేసేట్లే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలను నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఇప్పటికే నిమ్మగడ్డ చెప్పేశారు కాబట్టి. మరి ఉద్యోగులెవరు ఎన్నికల నిర్వహణలో పాల్గొనేది లేదని చెప్పిన విషయంపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

కొసమెరుపేంటంటే, ఈ మాటలన్నీ వీరివా ? లేక వీరి వెనుక ఎవరైనా ఉండి ఈ మాటలు చెప్పించారా అనే ఆరోపణ విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే… ఇపుడు సిబ్బంది అందరూ విధుల్లోనే ఉన్నారు. ఇతర విధుల్లో ఉంటే రాని కరోనా ఎన్నికల విధుల వల్లే వస్తుందా? అన్నది ప్రశ్న.