ఊహించినదే జరిగింది. ఎట్టకేలకు ఏపీ ఈఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను చేయాలనుకున్నదే చేసి చూపించారు. ఎట్టకేలకు మండలిని రద్దు చేశారు.
శాసన మండలి రద్దుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో శాసన మండలి రద్దు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. శాసన మండలిని రద్దు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. అసెంబ్లీ ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపుతారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్ డిఏ రద్దు బిల్లులను శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపించడంతో నిర్ఘాంత పోయిన రాష్ట్ర ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా.. మూడు రాజధానులకు లైన్ క్లియరైనట్టేనా అంటే రకరకాల సందిగ్ధతలు నెలకొన్న సంగతి తెలిసిందే.