AP: ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంతో ఆయన నిత్యం ప్రెస్ మీట్ కార్యక్రమాల ద్వారా ప్రజలలోకి వస్తూ తమ పార్టీ ఓడిపోవడానికి కారణాలను విశ్లేషిస్తున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే జగన్ వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలను మొదలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు నేతలు కార్యకర్తలను అభిమానులను కూడా ఈయన కలవబోతున్నారు.
ఇలా ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు జరగబోతున్నాయి అందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని ఇటీవల పిలుపునిచ్చారు. ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రజలలోకి రాబోతున్నారనే విషయం తెలిసి కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజలలోకి వస్తే తప్పనిసరిగా తమకు డామేజ్ జరుగుతుందని కూటమినేతలు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే జగన్ కంటే ముందుగా ప్రజలలోకి రావాలని చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆదేశాలను జారీ చేశారు. నిత్యం ప్రజల మధ్యనే ఉండాలని ఈయన దిశ నిర్దేశాలు చేసినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాల పాటు ప్రజలలోకి రాలేదు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఆరు నెలలకే ప్రజలలోకి వస్తున్న నేపథ్యంలో ఈయన ప్రజలలోకి వచ్చి తప్పనిసరిగా సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలను రెచ్చగొడతారు. ఇక ప్రతిపక్ష నేత ప్రజలలోకి వచ్చారు అంటే అధికార పార్టీకి సెగ తగులుతుందనే సంగతి మనకు తెలిసిందే.
ఈ విషయం తెలుసుకున్న జగన్ 2014 ఎన్నికల తర్వాత పాదయాత్ర ప్రారంభించి 2019లో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఈ క్రమంలోనే మరోసారి ప్రజలలోకి వచ్చి కూటమి ప్రభుత్వ పాలన గురించి ఇచ్చిన ఎన్నికల హామీల గురించి ప్రజలలో చర్చించే అవకాశాలు ఉన్నాయని ఇది తప్పనిసరిగా తమకు డామేజ్ చేసే అంశమే అని గ్రహించిన కూటమి నేతలు డిసెంబర్ 15 నుంచి ప్రజలలోకి వెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు ఆదేశాలను జారీ చేశారని తెలుస్తుంది అయితే మంత్రులు ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి స్పందన రాలేదనే చెప్పాలి.