2019 ఎన్నికల్లో ఓడిపోయి టీడీపీ ఎన్ని ఇబ్బందులు పడుతుందో గెలిచిన వైసీపీ కూడా అన్నే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న దాదాపు అన్ని నిర్ణయాలకు కోర్ట్ ల్లో అడ్డంకులు ఎదురు అవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీస్లకు దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎందుకు షాక్ ఇవ్వబోతున్నారంటే రాష్ట్రంలో చాలా పనులు అధికారుల నిమిత్తం లేకుండానే జరుగుతున్నాయి. చాలా కీలక ఫైల్స్ ను రాజకీయ నాయకులు అధికారుల అనుమతి లేకుండా తనిఖీలు చేస్తున్నారని, దీని వల్ల తాము ఇబ్బందులు వస్తాయని భావించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర శాఖలకు వెళ్లాలని నిర్ణయించునుకుంటున్నారు.
ఇప్పటికే జగన్ అనుకూల పత్రికకు ప్రభుత్వం నుంచి ఎక్కువగా యాడ్స్ వెళ్లినట్లు నిరూపితమైంది. ఇలాంటి విషయాల్లో నమోదైన కేసుల్లో అధికారులకు ఇబ్బందులు తప్పవు. పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి అవతవకలు జరిగితే ఇబ్బందులు పడాల్సింది అధికారులే. అందువల్లే అవకాశం ఉన్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసుల వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. దాదాపు ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు కూడా ఇప్పుడు కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఎదో విషయంలో ఏదైన తప్పు జరిగితే తమకు ఇబ్బందులు తప్పవని, రాజకీయ నాయకులను ఎదిరించి పని చేయలేమని భావించిన అధికారులు రాష్ట్రంలో నుండి బయటకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అధికారులు ఇస్తున్న షాక్ ను వైసీపీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.