అయ్యయ్యో….మందు బాబులకు తీరని అన్యాయం చేస్తున్న జగన్ ప్రభుత్వం

ap gvt passesd new rule that wont be cu

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ లో మందుబాబులకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి ఏపీ లోపి మద్యం అనుమతించే ప్రసక్తే లేదని ఒక వైపు ప్రభుత్వం చెప్తుంటే .. మరోవైపు మందుబాబులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి జోరుగా మద్యం ఏపీకి వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్ శాఖ కొత్తగా జీవో నెంబర్ 310ని విడుదల చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడంపై ఆంక్షలు పెట్టింది.

ap gvt passesd new rule that wont be cu
ap gvt passesd new rule that bringing the alohol from other states is a crime

సరైన పరిమిట్లు లైసెన్స్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు వీల్లేదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. కొత్త జీవోలో గతంలో మాదిరిగా 3 మద్యం బాటిల్స్ ఇతర రాష్ట్రాల నుండి తెచ్చుకునేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఇతర దేశాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు కేంద్రం నిబంధనల ప్రకారం అనుమతి ఉంది. కానీ ఇతర రాష్ట్రాల నుంచి పర్మిట్ లేకుండా మద్యం తెచ్చేందుకు మాత్రం ఏపీ ప్రభుత్వం ఒప్పుకోవడంలేదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.

ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం దశలవారీగా అమలు చేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. తొలి దశలో బెల్ట్ షాపులను మూయించారు. బ్లాక్ మార్కెట్లో మద్యం అమ్మకాలు జరగకుండా కల్తీ మద్యం లేకుండా కట్టడి చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత మద్యాన్ని ప్రభుత్వం దుకాణాల్లోనే విక్రయించేలా కొత్త పాలసీని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రంలోకి మద్యం రాకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.