ఈసీ ఉత్తర్వుల పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఏపీలో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయడంతో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిపి సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీసులందరిని సీఈసీ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం కౌంటింగ్ పూర్తయ్యే వరకు వారంతా సీఈసీ పరిధిలోనే ఉండునున్నారు. ఇందులో ఇంటలిజెన్స్ కి మినహాయింపునిచ్చింది.

ఇంటెలిజెన్స్ ఏడీజీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలను ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించింది. వీరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు అందడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు మాత్రమే ఈసి పరిధిలోకి వస్తారని లేని వారు రారని జీవోలో పేర్కొంది. ఇంటలిజెన్స్ ఏడిజి వెంకటేశ్వరరావు బదిలీ ఆపే అధికారం ప్రభుత్వానికి వచ్చినట్టైంది.