ఏపీ ప్రభుత్వానికి అనుకోని ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. సొనాట పార్టీ నేతలతోనే సమస్యలు అనుకుంటే ఈసారి చిత్రంగా ప్రభుత్వ అధికారి మూలంగా కేంద్రం నుండి అక్షింతలు వేయించుకోవాల్సి వచ్చింది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో సంచలనం రేపిన బ్యాంకుల ముందు చెత్త పోయించిన వ్యవహారం చూస్తుండగానే పెద్దదైపోయింది. ఉయ్యూరుతో పాటు విజయవాడ నగరంలో 16 బ్యాంకు శాఖల ముందు చెత్త వేయడాన్ని బ్యాంకులు తీవ్రంగా పరిగణించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా, జగనన్నతోడు, జగనన్న చేయూత తదితర పథకాల లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడంలేదని నిరసిస్తూ గురువారం మున్సిపల్, నగర పంచాయతీ అధికారులే స్వయంగా పలు బ్యాంకుల ముందు ట్రాక్టర్లతో చెత్తను తీసుకొచ్చి డంప్ చేశారు. దీంతో ఎర్లీ అవర్స్ కార్యకలాపాలు కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి.
ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ఎన్.ప్రకాష్‌రావును మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. చెత్త వేయడమే కాకుండా కమీషన్ పేరుతొ బోర్డులు కూడ పెట్టారు. దీంతో బ్యాంకు అధికారులు అందరూ సమావేసమై ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఇలా నేరుగా బ్యాంకుల మీద ఇలాంటి అవమానకర చర్యలు చూపడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని, ఎవరైతే రుణాలు కట్టగలరో వారికే ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ సంగతి జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ రంగ బ్యాంకుల మీద ఇలా చర్యలకు పూనుకోవడం జరగలేదు. దీన్ని పెద్ద తప్పిదంగానే భావించాలి.
ఈ విషయం తెలియడంతో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ సీరియస్ అయ్యారు. ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ పటేల్ ఇలాగేనా వ్యవహరించేది అంటూ ఫైర్ అయ్యారు. నేరుగా రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గనకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం కలుగజేసుకోవడంతో బుగ్గన తగిన చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చుకోవాలి వచ్చింది. ఇలా ఒక ప్రభుత్వ అధికారి చేసిన పనికి కేంద్రం సీరియస్ కావడం చిన్న విషయం కాదు. దీంతో సర్కార్ వెంటనే కమీషనర్ ను సస్పెండ్ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ సైతం బ్యాంకుల సంఘాలకు లేఖ రాశారు. చెత్త వేయించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్యాంకులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు కలిసి పనిచేద్దామని తెలిపారు. మొత్తానికి విషయం మరింత పెద్దది కాకముందే ప్రభుత్వం త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకోవడంతో పెద్ద నష్టం తప్పింది. లేకుంటే నేషనల్ లెవల్లో వార్తా ఛానెళ్లలో నలిగిపోవాల్సి వచ్చేది.