వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన అతిపెద్ద హామీల్లో మధ్య నిషేధం కూడ ఒకటి. ఆ ప్రకారమే అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్య నిషేధం పేరుతో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు జగన్. ప్రవేట్ వ్యక్తుల చేతి నుండి పూర్తిగా మద్యం దుకాణాలను స్వాద్వీనపరుచుకున్నారు. క్రమక్రమంగా మద్యం షాఫుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. ఒక్కో మనిషికి లెక్కగట్టి మరీ మద్యం అమ్మకాలు చేశారు. ఈ నేపథ్యంలో కరోనా లాక్ డౌన్ రావడంతో తిరిగి విక్రయాలు ప్రారంభించే సమయంలో ఏకంగా 75 శాతం ధరలను పెంచి అమ్మారు. ఈ ధరల పెంపుతో ప్రభుత్వం మీద విమర్శలు వెలువెత్తాయి. నిషేధం పేరుతో ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారని మండిపడ్డారు మందుబాబులు.
దానికితోడు రెగ్యులర్ బ్రాండ్లను మాయం చేసి లోకల్ బ్రాండ్లను విపరీతంగా ప్రోత్సహించారు. చిత్ర విచిత్రమైన పేర్లతో ఎప్పుడూ చూడని కొత్త మద్యం మార్కెట్లలో స్వైరవిహారం చేసింది. ఈ కారణంగా అక్రమ మద్యం ఏరులై పారింది. ప్రజల జేబులకు పెద్ద మొత్తంలో చిల్లు పడింది. ఇదంతా మందుబాబులను తగ్గించడానికేనని ప్రభుత్వం చెప్పగా గతంతో పోలిస్తే మందుబాబుల సంఖ్య, మద్యం వినియోగం తగ్గిన దాఖలాలు లేవు. దీంతో విపక్షాలు ప్రభుత్వం మీద మండిపడ్డాయి. ఇదొక ఫైల్యూర్ పాలసీ అన్నాయి. ఇక తాజాగా సర్కార్ చూస్తే మద్యం ధరలను 25 శాతం తగ్గించింది సర్కార్. ఈ ప్రకటన రాగానే మద్యనిషేధం అన్నారు.. ఇప్పుడేమో రేట్లను తగ్గించారు. ఈ దెబ్బతో అమ్మకాలు డబుల్ అవుతాయి. ఇక మీరు చేసిన నిషేధం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు.
ఖజానాలో డబ్బు లేకపోవడం వలనే గతంలో రేట్లు పెంచి సొమ్ము చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ధరలు తగ్గించి విక్రయాలను విపరీతంగా ప్రోత్సహించి ఆదాయం పొందాలని చూస్తోంది అంటూ ప్రతిఒక్కరూ విమర్శిస్తున్నారు. ఇలా రేట్లు పెంచినా విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వం రేట్లు తగ్గించాకా కూడ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో ధరలు పెంచినా తాగారు, తగ్గించినా మునుపటికంటే ఎక్కువగా తాగుతారు.. వీళ్ళను కట్టడి చేయడం ఎలాగ అనుకుంటూ సర్కార్ తలపట్టుకునే పరిస్థితి. ఇక మందుబాబులైతే పెంచిన ధరలకు అలవాటుపడిపోయాం కాబట్టి తగ్గించిన ధరలు కొంత ఉపశమనంగానే ఉన్నాయని, కానీ రెగ్యులర్ బ్రాండ్లు దొరకడంలేదనేదే పెద్ద బాధని చెప్పుకురావడం కొసమెరుపు.