భూమా బయటపెట్టిన టీడీపీ లీడర్ పేరు , ఏపీకి రానున్న హైదరబాద్ పోలీసులు ?

akhilapriya-cross-booked

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఏపీ నేతలు ఎవరు అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు , లోకేష్ వీర లెవల్లో రెచ్చిపోయేవారు. కానీ ,అఖిలప్రియ అరెస్ట్ అయ్యి 10 రోజులు అవుతున్నా కూడా చంద్రబాబు , నారా లోకేష్ కానీ కనీసం అటు వైపు తొంగిచూడలేదు. అధికారికంగా అఖిలప్రియ అరెస్టుపై స్పందించలేదు. అఖిల అరెస్టు గురించి ఎందుకు నోరిప్పటం లేదు అనేది ప్రశ్న.

ap former minister akhila priya in bowenpally kidnap case

భూమా ఫ్యామిలికి ఇలాంటి వివాదాలు కొత్తేమీకాదు. బతికున్నపుడు ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి పైన భూ ఆక్రమణలు, కేసులు, ప్రత్యర్ధులపై దాడులు చేయటం, కేసులవ్వటం, అరెస్టులు, కోర్టులు, విచారణలు కొత్తేమీకాదు. అలాంటి నేతలు ఇపుడు కూడా టీడీపీలో చాలామందే ఉన్నారు. అవినీతి, హత్యకు కుట్ర, అక్రమాల కేసుల మీద అరెస్టులయి బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నారు. మరి వాళ్ళ విషయంలో మాత్రం చంద్రబాబు, లోకేష్ లు అప్పట్లో ఎంత గోల చేశారో అందరు చూసిందే. కాకపోతే అప్పట్లో అచ్చెన్న, కొల్లు ఇద్దరు బీసీలు కావటంతో పాటు వాళ్ళను అరెస్టు చేసింది ఏపి పోలీసులే కావటం చంద్రబాబుకు బాగా కలిసొచ్చింది.

కానీ ఇపుడు అఖిలను అరెస్టు చేసింది తెలంగాణా పోలీసులు. అఖిల అరెస్టుపై ఏమన్నా మాట్లాడితే కేసీయార్ కు ఎక్కడ మండుతుందో అనే భయమే తండ్రి, కొడుకుల నోళ్ళను మూయించేసినట్లుంది. పైగా అఖిలతో భవిష్యత్తులో పెద్దగా పనికూడా ఉన్నట్లు లేదు. ఎందుకంటే అరెస్టుకు ముందు కూడా కర్నూలు జిల్లాలో అఖిల దాదాపు ఒంటరైపోయింది. ఏదో అమరావతికి మద్దతుగా జిల్లాలోని ఎవరు మాట్లాడకపోయినా చంద్రబాబు కోసమే అఖిల నొటికొచ్చింది మాట్లాడారు. ఆమె అరెస్టు జరిగినా ఎవరినీ నోరిప్పద్దని గట్టిగా ఆదేశాలు జారీ అయినట్లుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే .. చంద్రబాబు జాబితాలో అఖిలప్రయ లేనట్టుగా తెలుస్తుంది.