ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగుల నుండి తీవ్ర వ్యతిరేకిత ఎదురవుతుంది. ఏపీ ఉద్యోగులు తమ సమస్యలకు సంబందించి ఏపీ సర్కార్ ని కాస్త ఇబ్బంది పెడుతున్నారు. వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి జగన్ ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతున్నారు. తమకు రావాల్సిన నిధులపై ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శోభన్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. కార్యవర్గంలో మార్పు చేర్పు ల కోసం నేడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాము అని ఆయన అన్నారు. రాష్ట్ర ఉద్యోగులు వాళ్ళకు రావలసిన డబ్బు సకాలంలో రాకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు అని పేర్కొన్నారు.ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన డబ్బు సకాలంలో చెల్లించాలని కోరుతున్నాం అని ఆయన అన్నారు. ప్రమోషన్ లు లేకపోవడం వలన ప్రమోషన్ ల కోసం వేచి ఉన్నవారు నష్టపోతున్నారు అని విమర్శించారు.
ట్రెజరీ శాఖలో మొత్తం ఆన్లైన్ విధానం ఉంది దీని వలన మాపై తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది అని మండిపడ్డారు. నెట్ ,సిస్టం ల సమస్యలతో సతమతమవుతున్నాం, దీన్ని హెచ్ఓడి ల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు శూన్యం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సిఎఫ్ఎంఎస్ లోపాలు రావడం, ట్రెజరీ పై అవగాహన లేకపోవడం వలన సమస్యలు తలెత్తుతున్నాయి అని ఆయన అన్నారు.ట్రెజరీ ఉద్యోగులకు మార్చి నెల అలవెన్సు ఇస్తారు,కోవిడ్19 తో ఈ మార్చి నెల అలవెన్స్ రాలేదు అని ఆవేదన వ్యక్తం చేసారు. కోవిడ్ సమయంలో కూడా మా విధులు నిర్వర్తించాము కాబట్టి అలవెన్స్ లు ఇప్పించాలని కోరుతున్నాం అని అన్నారు. జిల్లాల్లో ఖాళీలను ప్రమోషన్ ల ద్వారా కానీ ,నియామకాల ద్వారా భర్తీ చేయాలి అని డిమాండ్ చేసారు.