కొత్త సర్వే… టీడీపీ + జనసేన పొత్తు ఫలితం ఇది!

రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తులోనే టీడీపీ – జనసేన కలిసి వేళ్తాయని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా… బీజేపీ తో కలిసి వేళ్తారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నారు. అయితే జనసేన కూడా ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయదనే విషయం పవన్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఈ క్రమంలో… టీడీపీ + జనసేన కలిసి పోటీ చేస్తే రాబోయే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. వీరి పొత్తు ప్రభావం వైసీపీ గెలుపుపై ఏ మేరకు ప్రభావం చూపబోతుంది.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏపీ ప్రజలు ఎవరికి ఎంతశాతం మంది మద్దతు తెలిపారు అనే విషయాలను ఈ తాజ సర్వే వెళ్లడించింది.

అవును… “పోల్ స్ట్రాటజీ” అనే సంస్థ చేపట్టిన సర్వే వివరాలు వెళ్లడించింది. ఈ ఫలితాల ప్రకారం… రాబోయే ఎన్నికల్లో టీడీపీ + జనసేన కలిసి పోటీ చేస్తే సుమారు 41శాతం ఓట్లు రావొచ్చని తెలిపింది. ఇదే సమయంల్లో వైసీపీకి 49 శాతం ఓట్లు కన్ ఫాం అని సర్వే తెలిపింది. ప్రస్తుతం ఈ సర్వే ఫలితాలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇదే సమయంలో… ఏపీలో ఎవరు బెస్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థి అనే విషయంపై కూడా ఈ సంస్థ సర్వే నిర్వహించింది. అందుకు సంబంధించిన ఫలితాలు కూడా వెళ్లడించింది. ఇందులో భాగంగా… తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ కు 56% మంది ఓటు వేయగా… 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటూ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు 37 శాతం మంది జైకొట్టారని తెలుస్తుంది.

ఇక తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వారాహియాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రకటించుకున్న పవన్ కు 7% మంది మద్దతు తెలిపారు.

ఇదే విధంగా… జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై సుమారు 56 శాతం మంది పాలన బాగుందని చెప్పగా.. 22 శాతం మంది బాగాలేదని అంటున్నారని ఆ సర్వే ఫలితాలు వెళ్లడించింది. ఇదే సమయంలో 9 శాతం మంది చాలా బాగుందని చెప్పగా 8 శాతం మంది అసలు బాలేదని అన్నారని సర్వే తెలిపింది. ఇక మిగిలిన మూడు శాతం మంది మాత్రం ఎటూ చెప్పలేక న్యూట్రల్ గా ఉన్నారట.