2024లో ఆ ఐదుగురిని ఓడించాలనుకుంటున్న సీఎం జగన్.. సాధ్యమవుతుందా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ కొన్ని విషయాలకు సంబంధించి మొండిగా ముందుకెళతారని అందరూ భావిస్తారు. 2024 ఎన్నికల్లో ఐదుగురు రాజకీయ నాయకులను కచ్చితంగా ఓడించాలని జగన్ భావిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించడం ద్వారా టీడీపీ బలాన్ని మరింత తగ్గించవచ్చని జగన్ భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు వల్లే 2014లో సంవత్సరంలో వైసీపీ అధికారంలోకి రాలేదు.

కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట కాగా గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ సరైన అభ్యర్థిని నిలబెడితే కుప్పంలో వైసీపీ అధికారంలోకి వస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. చంద్రబాబు తర్వాత సీఎం జగన్ 2024 ఎన్నికల్లో ఓడించాలని భావిస్తున్న నేతలలో పవన్ కళ్యాణ్ ఒకరు కావడం గమనార్హం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

2024 ఎన్నికల్లో తిరుపతి లేదా పిఠాపురం నుంచి పవన్ పోటీ చేసే ఛాన్స్ ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. త్వరలో పవన్ కళ్యాణ్ అధికారికంగా తను పోటీ చేసే నియోజకవర్గం గురించి ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, గద్దె రామ్మోహన్ రావులను కూడా ఓడించాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

ఈ నేతలు ఘాటుగా విమర్శించడం జగన్ కు ఆగ్రహం కలిగించిందని బోగట్టా. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉంటే మరికొన్ని ప్రాంతాలలో వైసీపీకి వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. 2024లో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని కానీ 2019 ఎన్నికల స్థాయిలో వైసీపీ ప్రభంజనం సృష్టించే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నలుగురు టీడీపీ నేతలను, ఒక జనసేన నేతను టార్గెట్ చేసిన జగన్ ఈ నేతలను ఓడిస్తారేమో చూడాల్సి ఉంది.