డిల్లీకి వైఎస్ జగన్ :: నిమ్మగడ్డ + చంద్రబాబు కి గుబులు?

ap cm ys jagan delhi tour

ఏంటో.. ఏపీ రాజకీయాలు. ఎప్పుడు ఏమౌతుందో తెలియదు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఎటు వైపు టర్న్ అవుతున్నాయో తెలియదు. ఈనేపథ్యంలో అందరి చూపు సీఎం జగన్ వైపు పడింది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ అడుగులు ఎటువైపు ఉంటాయి.. అనేది సస్పెన్స్ గా మారింది. సీఎం జగన్ ను రాజకీయ నాయకులే కాదు.. ఎన్నికల సంఘం కూడా టార్గెట్ చేసేసరికి.. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.

ap cm ys jagan delhi tour
ap cm ys jagan delhi tour

వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడం కోసం టీడీపీ కృషి చేస్తోంటే… ఎన్నికల సంఘం మాత్రం జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోంది. అందుకే.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రచ్చ రచ్చ చేస్తోంది. ప్రభుత్వం వద్దన్నా కూడా వినకుండా.. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామంటూ షెడ్యూల్ విడుదల చేసింది.

అందుకే.. ఇలా కాదని డైరెక్ట్ గా కేంద్రం వద్దే తేల్చుకుంటానని సీఎం జగన్ భావిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారాన్ని అక్కడే తేల్చేయాలని జగన్ ఫిక్స్ అయిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే ఇక నో డౌట్.. ఎన్నికల సంఘం వెనక్కి తగ్గాల్సిందే కాబట్టి.. అందుకే జగన్ అక్కడి నుంచి నరుక్కు రావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కేంద్రాన్ని కలిసి.. కేంద్రానికి నివేదిక సమర్పించి.. ఎన్నికల సంఘం వ్యవహారంపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరడంతో పాటు.. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా జగన్.. రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీని కోసమే వైసీపీ సీనియర్ నేతలతో ప్రస్తుతం జగన్ చర్చలు జరుపుతున్నారట. చూడాలి మరి.. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో?