వాలంటీర్లకు షాకిచ్చిన సీఎం వై ఎస్ జగన్ !

Ys Jagan

ఆంధ్రప్రదేశ్ లో భారీ మెజారిటీ స్థానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం , అధికారం చేపట్టిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించారు. నవరత్నాల పథకాల అమలులో భాగంగా సంక్షేమ లబ్ధిని ఇంటింటికీ అందించే లక్ష్యంతో ఈ వాలంటీర్ వ్యవస్థను చేపట్టిన సంగతి తెలిసిందే.

cm jagan
cm jagan

అయితే 35 ఏళ్ల వయసు నిండిన వారిని ఉద్యోగం నుంచి తొలగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాలతో వాలంటీర్లకు పెద్ద షాక్ తగిలింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారితోపాటు 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వలంటీరు సచివాలయం, వార్డు వలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ జీఎస్‌.నవీన్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో వాలంటీర్లు షాక్ అవుతున్నారు.

50 ఇళ్లకు ఒక వాలంటీరు లెక్కన రాష్ట్రంలో 2.60 లక్షల మందిని గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. వీ ఇప్పటికే 35 ఏళ్లు నిండి వాలంటీరుగా పనిచేస్తున్న వాలంటీర్లకు సీఎఫ్‌ఎంఎస్‌ సిస్టమ్‌ ద్వారా అందించే జీతాలు రావడంలేదు. గత కొంతకాలం నుంచి ఈ అంశం చర్చనీయాంశమైంది. దీనితో 35 ఏళ్లు నిండిన వారెవరైనా ఉంటే వారిని వెంటనే ఆ విధుల నుంచి తొలగించాల్సిందిగా కమిషనర్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు.