టిడిపి రెబల్స్ పై కఠిన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు

ఎన్నికల వేళ ఏ పార్టీకైనా రెబెల్స్ బెడద ఉంటుంది. సుధీర్ఘ కాలం పార్టీలో పని చేసినా ఎమ్మెల్యే, ఎంపీ పార్టీ టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. వేరే పార్టీకి పోలేక ఉన్న పార్టీని విడువలేక వారు రెబల్స్ గా బరిలోకి దిగుతున్నారు. దీంతో వారిని బుజ్జగించేందుకు కీలక నేతలు రంగంలోకి దిగారు. అయినా రెబల్స్ వినకపోవడంతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కఠిన నిర్ణయం తీసుకున్నారు. రెబల్స్ పై వేటు వేశారు.

పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి మరీ బరిలో దిగడం క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తుందని, అందుకే ఈసారి రెబల్స్ గా బరిలో ఉన్న 9 మందిపై బహిష్కరణ వేటు వేస్తున్నట్టు టీడీపీ హైకమాండ్ వెల్లడించింది.

కడప నుంచి రాజగోపాల్, తాడికొండ నుంచి సర్వా శ్రీనివాసరావు, తంబాళ్లపల్లి నుంచి మాధవరెడ్డి, విశ్వనాథరెడ్డి, మదనపల్లె నుంచి బొమ్మనచెరువు శ్రీరాములు, బద్వేలు నుంచి విజయజ్యోతి, గజపతినగరం నుంచి కె.శ్రీనివాసరావు, రంపచోడవరం నుంచి ఫణీశ్వరి, అవనిగడ్డ నుంచి కంఠమనేని  రవిశంకర్ రెబల్స్ గా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వీరందరిపైనా బహిష్కరణ వేటు పడింది.