పార్టీ అధ్యక్షుల మార్పు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ తప్పు చేశారా?

3 Capitals

ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో ఎంతోమంది నేతలు ఉన్నా ఆ నేతలలో గుర్తింపు ఉన్న నేతలు చాలా తక్కువమంది అనే సంగతి తెలిసిందే. వైసీపీ అధ్యక్షులను మార్చిన నేపథ్యంలో ఆ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి. సీఎంల హెచ్చరికల నేపథ్యంలో కొంతమంది తమంతకు తాము తప్పుకున్నామని అన్నారు. ఎమ్మెల్సీ భరత్ ను కుప్పం వైసీపీ బాధ్యతల నుంచి తప్పించారని సమాచారం.

చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బాలనాగిరెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, సుచరిత, అవంతి శ్రీనివాస్, పుష్ప శ్రీవాణిలను కూడా బాధ్యతల నుంచి తప్పించారని సమాచారం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ సమీక్షలో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాది ఉన్న నేపథ్యంలో వైసీపీ చేసిన మార్పుల వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ ఎమ్మెల్యేల పనితీరు గురించి ప్రజల్లో సైతం నెగిటివ్ ఒపీనియన్ కలుగుతోంది. వైసీపీ పదుల సంఖ్యలో సలహాదారులను నియమించుకున్నా ఆ సలహాదారుల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ పార్టీ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అయితే అది ఈ విధంగా కాదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

వైసీపీ వేగవంతంగా తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి శాపంగా మారాయని మరి కొందరు చెబుతున్నారు. వైసీపీని అభిమానించే అభిమానులు సైతం వైసీపీ నిర్ణయాలు తమకు అర్థం కావడం లేదని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎన్ని అసెంబ్లీ స్థానాలలో విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది.