టిడిపి అధినేత చంద్రబాబు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారు. జగన్ లాగా ఆయన కూడా నియోజకర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించి వారిని అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. ఇలా నియోజకవర్గాలకు అభ్యర్థులను నియమించడం జగన్ స్టైల్. ఒకసారి నియోజకవర్గానికి ఇంచార్జ్ ను ప్రకటించారంటే, అతనే అభ్యర్థి. ఇందులో ఎంతో కంపల్షన్ ఉంటే గానీ మార్పు ఉండదు.
దీనికి భిన్నంగా చంద్రబాబునాయుడు నిర్ణయాలను చివరిక్షణం దాకా ప్రకటించరు. అభ్యర్థుల ఎంపిక కూడా అంతే. సిటింగ్ ఎమ్మెల్యే అయినా సరే చివరిదాకా నరాలు తెగే ఉత్కంట. టికెట్ ఉంటుందో, వూడుతుందో తెలియకుండా నాన్చి అభ్యర్థి బిక్క చచ్చేలా చేస్తారు. ఎపుడు అర్థరాత్రి పేర్లు ప్రకటించడం అలవాటు. ఏడెనిమిది నెలలు ముందుగా చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడం అనేది ఉండదు. అయితే, 2019 ఎన్నికల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడెనిమిది నెలలు ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అది కూడా జగన్ పద్ధతిలో…
చంద్రబాబు స్టైల్ మార్చాడు. ప్రతిసారి ఎన్నికల సమయంలో అభయార్థులను ప్రకటించే చంద్రబాబు ఈసారి జగన్ ప్లాన్ అమలు చేశాడు. ఇంకా ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉన్నా ఇప్పుడే బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నారు. టిడిపి ట్రెడిషన్ ని పక్కనబెట్టి ఏ నియోజకవర్గంలో వైసిపి బలంగా ఉందో అక్కడ ముందే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. పనితీరు సరిగా లేని టిడిపి ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తూ, వారి పని తీరు మెరుగు పరుచుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ గెలుపు కోసం ఇప్పటి నుండే పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారట. ఎలక్షన్ల కోసం పార్టీ నాయకులను, కేడర్ ను సిద్ధం చేస్తున్నారట. ప్రజల్లోకి వెళ్లమంటూ దిశానిర్ధేశం చేస్తూ వారి యాక్టివిటీస్ పైన నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారట. పని తీరు సరిగా లేకుంటే మీ స్థానంలో వేరొకరు వస్తారంటూ హెచ్చరిస్తున్నారని సమాచారం.
ముందే అభ్యర్థులను ప్రకటించే జగన్ ప్లాన్ కాపీ చేసిన బాబు సొంత జిల్లా నుండే ఆ ప్లాన్ అమలు చేశారు. తొలుత చిత్తూరుపై కసరత్తు చేసిన చంద్రబాబు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ గా పూలవర్తి నానిని ఫిక్స్ చేశారు. పుంగనూరు ఇన్‌చార్జ్ గా మంత్రి అమర్ నాధ్ రెడ్డి మరదలు అనీషారెడ్డిని ఖరారు చేశారు. ఈమధ్యనే టిడిపిలో చేరిన కొండ్రు మురళిని శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. వైసిపి గెలిచిన బలమైన నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తున్నారు.