మార్గదర్శి కేసు కార్పొరేట్ ఫ్రాడ్… సంచలన విషయాలు వెల్లడించిన సీఐడి!

మార్గదర్శి కేసులో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని కామెంట్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంతకాలం అంటే మాజీ ఎంపీ ఉండవల్లి ఒక్కరే పోరాడటం వల్ల.. వ్యవహారం డెడ్ స్లోగా నడిచేది! ఎప్పుడైతే ఏపీ సర్కార్ రంగంలోకి దిగిందో వ్యవహారం వాయువేగాన్ని అందుకుందని తెలుస్తోంది! ఈ సమయంలో ఏపీ సీఐడీ లేటెస్ట్ ప్రెస్ మీట్ పెట్టి.. సంచలన విషయాలు వెళ్లడించింది.

అవును… “మార్గదర్శి కేసు కార్పొరేట్ ఫ్రాడ్” అని ఒక్క విషయంలో విషయం మొత్తం చెప్పేసినంత పనిచేశారు ఏపీ సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్! తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఆవశ్యతకను వివరించిన ఆయన… డిపాజిట్ దారులు మోసపోకుండా మీడియా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇక మార్గదర్శిపై ఇప్పటివరకూ ఏడు క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని చెప్పిన సీఐడీ ఎస్పీ… వీటిలో రెండు కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేశామని, మిగతా ఐదు కేసుల్లో విచారణ తుదిదశకు వచ్చిందని అన్నారు. మార్గదర్శి కేసుల విచారణ తాజా సమాచారాన్ని ఆయన మీడియా సమావేశంలో వివరించారు.

మార్గదర్శిపై నమోదైన ఏడు క్రిమినల్ కేసులపై విచారణ చేపట్టినట్టు తెలిపిన ఎస్పీ అమిత్ బర్దర్.. ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులు అటాచ్ చేస్తూ హోం శాఖ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మొత్తంగా 1,035 కోట్ల రూపాయల చరాస్తులు అటాచ్ చేసినట్టు తెలిపారు.

ఇదే క్రమంలో వీటికి సంబంధించి కోర్టులో అటాచ్ మెంట్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పిన ఎస్పీ… చార్జిషీట్ దాఖలు చేసిన రెండు క్రిమినల్ కేసుల్లో 15 మందిపై చార్జిషీట్ వేశామన్నారు. ఆ రెండు కేసుల్లోనూ ఏ1 రామోజీ రావు, ఏ2 శైలజాకిరణ్ అని చెప్పారు.

మార్గదర్శిలో మొత్తంగా నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించడంతోపాటు.. పలు తప్పులు చేశారని, లెక్కలు మార్చారని, అంతిమంగా డిపాజిట్ దారులకు వ్యతిరేకంగా మోసపూరితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఇదే సమయంలో మార్గదర్శి కేసుల్లో సీఐడీ విచారణ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని వెల్లడించారు.

ఇక త్వరలోనే మిగిలిన ఆ 5 కేసుల్లోనూ ఛార్జి షీట్ నమోదు చేస్తామని చెప్పిన సీఐడీ ఎస్పీ.. మార్గదర్శి చిట్‌ ఫండ్ సంస్థ డిపాజిట్ దారులను మోసం చేసి నిధులు మళ్లించిందని తెలిపారు. ఈ సందర్భంగా డిపాజిట్ దారులు సంతకాలు పెట్టే ముందే పూర్తిగా నిబంధనలు చదవాలని సూచించారు.