రంగా హత్యను గుర్తుచేసిన బీఆరెస్స్… తెరపైకి సంచలన డిమాండ్!

వంగవీటి రంగా హత్యకు సంబంధించి ఇప్పటికీ ఒక చర్చ ఏపీలో సాగుతూనే ఉంటుంటుంది. ఈ విషయంలో ఇది పూర్తిగా టీడీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడే చేయించాడని కొంతమంది కాపు నాయకులు, ఆ సామాజిక వర్గ ప్రజలు చెబుతుంటారు. అయితే తాజాగా ఈ విషయంపై సంచలన డిమాండ్ ఒకటి తెరపైకి తెచ్చింది ఏపీ బీఆరెస్స్.

వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు అని.. ఇప్పుడు అలాంటి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ తిరుగుతుంటారని… జనసేనను విమర్శించే క్రమంలో చాలామంది కాపు సామాజికవర్గ ప్రజానికం మైకులముందే చెబుతుంటుంది. ఇదే సమయంలో రాజకీయాలకోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబుతో పాటూ ఆ లక్షణాన్ని పవన్ కూడా అలవర్చుకున్నారని అంటుంటారు.

అయితే వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా కూడా చంద్రబాబు చంకనెక్కే ఉన్నాడుకదా అనేది జనసైనికుల వాదన. దీంతో రాధా పై కూడా తీవ్రస్థాయిలో కొంతమంది కాపు సామాజికవర్గ ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటారు. ఈ సమయంలో రాధా సమక్షంలోనే… రంగా హత్యపై విచారణ చేయించాలని ఏపీ బీఆరెస్స్ డిమాండ్ చేసింది.

అవును… రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా గాజులరామారంలో ఏర్పాటు చేసిన పది అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏపీ బీఆరెస్స్ చీఫ్ తోట చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన… పేదల పక్షపాతిగా నిలిచిన దివంగత వంగవీటి మోహన రంగా ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఆయన హత్య విషయాన్ని ప్రస్థావించారు తోట!

ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచిన రంగాను కొందరు దుర్మార్గుల ప్రోద్భలంతో అత్యంత దారుణంగా హత్య చేశారని తోట చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధ కూడా పాల్గొన్నారు. ఆయన సమక్షంలోనే తోటచంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

దీంతో “రంగా హత్య గావింపబడటం.. ఆ హత్య టీడీపీ ప్రభుత్వంలోనే జరగడం.. అందుకు చంద్రబాబే కారణం అనే వాదనలు పెరగడం.. అయినా కూడా పవన్ కల్యాణ్, చంద్రబాబుతోనే తిరగడం, వంగవీటీ రాధా టీడీపీలో కొనసాగడం”… మొదలైన విషయాలపై మరోసారి చర్చ మొదలైంది!!