AP: మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు… ఇకపై 13 జిల్లాలే!

AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఎన్నో కొత్త విధానాలను రద్దు చేస్తూ వచ్చింది. ఇలా జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి ఎన్నో కొత్త విధానాలను ఇప్పటికే రద్దు చేయగా తాజాగా చంద్రబాబు నాయుడు మరో నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలుగా మార్చిన విషయం మనకు తెలిసిందే.

ఇలా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలను పార్లమెంటు సెగ్మెంట్ కేంద్రంగా ఒక జిల్లాగా గుర్తిస్తూ.. 26 జిల్లాలను చేశారు. నిజానికి 25 పార్లమెంటు స్థానాలు ఉన్నా.. విశాఖలో పెద్ద నియోజకవర్గాలు ఉండడంతో వాటిని రెండుగా విభజించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు ఉన్నాయి అయితే ఈ 26 జిల్లాల వల్ల ఎక్కడ పెద్దగా సమస్య అయితే ఏర్పడలేదు కానీ పలుచోట్ల మాత్రం జిల్లాల పేర్లు మార్చాలని అలాగే కలెక్టర్లకు భవనాలు లేకపోవడంతో కలెక్టర్ల కోసం అద్దె భవనాలను ఏర్పాటు చేశారు.

ఇలా కొత్త జిల్లాల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉందని భావించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి కొత్త జిల్లాలన్నింటిని రద్దుచేసి ఇకపై ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలనే ప్రకటించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇదే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయట. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అనే విషయంపై క్లారిటీ రానుంది.

ఇక జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఇసుక పాలసీ మద్యం విధానాన్ని కూడా రద్దు చేసే ఉచిత ఇసుక పాలసీతోపాటు పాత విధానంలోనే మద్యం దుకాణాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందా అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు. ఇక తాజాగా ఈ 26 జిల్లాలు అనే ప్రాతిపదికను కూడా చంద్రబాబు నాయుడు రద్దుచేసి పాత జిల్లాలనే ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.