మరో మిర్యాలగూడ అమృత ప్రణయ్ కేసు

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులాగే ఈ కేసు కూడా ఉంది. రెండు నెలల క్రితం మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ ని అమృత తండ్రి మారుతీరావు హత్య చేయించాడు. తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నందుకు మారుతీరావు కిరాయి హంతకులతో హత్య చేయించాడు. ఇక్కడ మాత్రం అమ్మాయి కుటుంబ సభ్యులే అబ్బాయిని కిడ్నాప్ చేసి చంపేశారు. పెళ్లైన రెండు రోజులకే ఈ ఘాతుకానికి ఒడిగట్టడం సంచలనం సృష్టిస్తోంది. అసలు వివరాలు ఏంటంటే…

కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన నీనూ, జోసెఫ్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. జోసెఫ్ బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. నీనూ డిగ్రీ పూర్తి చేసింది. నీనూకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో జోసఫ్ నీనూను తీసుకెళ్లి రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు.

నీనూ, జోసెఫ్

ఈ విషయం ఇంట్లో వారికి తెలిసింది. నీనూ కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. నీనూ, జోసఫ్ లు పెళ్లి చేసుకొని కొట్టాయంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నారు. వారి అడ్రస్ కనిపెట్టిన నీనూ కుటుంబ సభ్యలు ఇద్దరిని పట్టుకొని చితకబాదారు. నీనూను తమ ఇంటికి తీసుకెళ్లారు. జోసఫ్ ను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకపోయి కిడ్నాప్ చేశారు.

పెళ్లైన రెండో రోజు నాడే జోసఫ్ ను చంపి చాలి యెక్కర కెనాల్ లో పడేశారు. కెనాల్ లో మృతదేహం కొట్టుకుపోతుండగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో జోసఫ్ కుటుంబ సభ్యులు అసలు విషయం పోలీసులకు తెలిపారు. తామే జోసఫ్ ను చంపినట్టు నీనూ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మిర్యాలగూడ అమృత ప్రణయ్

మరో వైపు ఈ సంఘటన పై ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ ఘటనను కేరళ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. జోసెఫ్ నిందితులపై విచారణ త్వరగా పూర్తి చేసి శిక్ష పడేలా చేయాలని కేరళ సీఎం పినరయి విజయన్ హోం శాఖను ఆదేశించారు. సీఎం జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. దీని పై కోట్టాయం సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. దీనిని పరువు హత్యగా తేల్చిన కోర్టు ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. ఆరు నెలల్లోపు దోషులకు శిక్ష పడాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.

మరోవైపు నీనూ మాత్రం జోసేఫ్ ని చంపిన నిందితులకు శిక్ష పడాల్సిందేనని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. ప్రేమించుకోవడం తప్పా అని ప్రశ్నిస్తుంది. నీనూకి ప్రజాసంఘాలు, విద్యార్దిసంఘాలతో పాటు కేరళ ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. దాదాపు మిర్యాలగూడ అమృత ప్రణయ్ కేసులాగానే నీనూ, జోసెఫ్ ల కథ ఉంది.