తండ్రి పేరుతో సుజనా మరో మోసం

తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చేసిన మరో మోసం తాజాగా బయటపడింది. తన అవసరాల కోసం ఏకంగా తండ్రి పేరునే మార్చేశారు. విషయం బయటపడటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. వివిధ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న వారికి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసి) డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (డిన్) కేటాయిస్తుంది. ఒక డైరెక్టర్ ఎన్ని కంపెనీల్లో అయినా ఉండొచ్చు. డైరెక్టర్ హోదాలో ఒకసారి డిన్ తీసుకుంటే అది జీవితకాలం ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక డిన్ మాత్రమే ఉండాలన్నది నబంధన. కానీ వైఎస్ జనార్ధన రావుకు  మాత్రం రెండు డిన్ నెంబర్లున్నాయి. ఒకటి వైఎస్ జనార్ధనరావు పేరుతో ఉంటే మరోటి వైఎస్ జనార్ధనరెడ్డి పేరుతో ఉంది. మరి ఒక వ్యక్తికి రెండు డిన్ నెంబర్లు ఎలా వచ్చాయి ?

 

ఎలా వచ్చాయంటే ఇక్కడే సుజనా తన క్రిమినల్ బుర్రకు పనిపెట్టారు. వైఎస్ జనార్ధనరావు అంటే సుజనా చౌదరి తండ్రి. అసలు తన పేరుతో జనార్ధనరావుకు డిన్ నెంబర్ ఉందన్న విషయం కూడా తెలుసో తెలీదో అనుమానంగా ఉంది. సుజనా మొన్న రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి అందించిన ఎన్నికల అఫిడవిట్లో తన తండ్రి పేరు, ప్యాన్ నెంబర్, ఇంటి చిరునామా, డిన్ నెంబర్ అన్నీ ఇచ్చారు. అయితే, అదే  అడ్రస్, ప్యాన్ నెంబర్ తో మరో డిన్ నెంబర్ ఉన్నట్లు 2016లోనే ఓ లాయర్ గుర్తించారు. జనార్ధరావు పేరుతో ఒక డిన్ నెంబర్, జనార్ధనరెడ్డి పేరుతో మరో డిన్ నెంబర్ ఉన్నట్లు తెలుసుకున్నారు.

 

రెండు డిన్ నెంబర్లు తీసుకునేటపుడు చేసిన దరఖాస్తులో చూపించిన ఇళ్ళ అడ్రసులు, ప్యాన్ నెంబర్లు చూస్తే రెండు ఒకటే. ఒకే వ్యక్తికి రెండు డిన్ నెంబర్లు ఎలా వచ్చాయన్నది కూపీ లాగితే రెండు డిన్ నెంబర్లున్న వ్యక్తి సుజనా చౌదరి తండ్రి అన్న విషయం బయటపడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. మరి రెండు డిన్ నెంబర్లతో సుజనా ఏమేమి మోసాలు చేశారో ఇంకా బయటపడలేదు లేండి. అంటే తన అవసరాల కోసం ఏకంగా తండ్రి పేరును కూడా మార్చేయగలిగిన ఘరానా మోసగాడని తెలుస్తోంది.  ఈ విషయమై దర్యాప్తు చేసిన ఆర్వోసి కూడా సుజనా మోసాన్ని నిర్దారించుకుంది.

 

నిబంధనల ప్రకారం రెండు డిన్ నెంబర్లు నిషిద్ధం. కంపెనీల చట్టం ప్రకారం రెండు డిన్ నెంబర్లున్న వ్యక్తికి ఆరు మాసాల జైలుశిక్ష గానీ లేకపోతే రూ 5 వేట ఫైన్ కానీ వేస్తారు. ఒక్కోసారి రెండు రకాలుగాను శిక్ష పడుతుంది. ఇఫ్పటికే వివిధ బ్యాంకులను మోసం చేసినందుకు ఈడి విచారణను ఎదుర్కోబోతున్న సుజనాపై తాజా మోసం బయటపడింది. అంటే సుజనా మోసాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ ఇంకా ఎన్ని మోసాలు బయటపడతాయో చూడాలి.