ఏపీ హైకోర్టులో మరో మొట్టికాయ వేయించుకోటానికి సిద్దమైన వైసీపీ ప్రభుత్వం!

jagan is planning to fight for state issues

విశాఖపట్నం గెస్ట్ హౌస్ నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరోసారి జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. కాపులుప్పాడ కొండపై అతిథి గృహ నిర్మాణం చేపట్టవద్దని అమరావతి జేఏసీ నేతలు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కాపులుప్పాడ కొండపై అతిథి గృహం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ అమరావతి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరుపనుంది.

another blow to jagan in the highcourt
Jagan mohan reddy

పిటీషనర్ తరుఫున న్యాయవాది మురళీధర్ వాదనలు వినిపించారు. గ్రే హౌండ్స్ కు ఇచ్చిన స్థలంలో అతిథి గృహం ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. గ్రే హౌండ్స్ నక్సల్స్ టెర్రరిస్ట్ వ్యతిరేక దళం రహస్య ఆపరేషన్ నిర్వహిస్తుంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.ఈ వాదనలు విన్న హైకోర్టు వారం రోజుల్లో ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని పేర్కొంది.అలాగే గెస్ట్ హౌస్కు కేటాయించిన 30 ఎకరాల్లో చెట్లు కూడా నరకవద్దని ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.