“అన్న క్యాంటిన్లు ” మూత పడిపోయాయి

“అన్న క్యాంటిన్లు ” మూత పడిపోయాయి

2018 జులైలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన అన్న క్యాంటిన్లు ఇప్పుడు మూత పడ్డాయి . రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ క్యాంటీన్ల కు పసుపు రంగు స్థానంలో తెల్ల రంగు వేసి నడిపిస్తూ వస్తున్నారు . వీటి నిర్వహణ బాధ్యత అంతా అక్షయ పాత్ర ఫౌండేషన్ చూసుకుంటున్నది . వీటి ద్వారా పేదలకు టిఫిన్ లేదా భోజనం 5 రూపాయలకే ఇవ్వడం మొదలు పెట్టారు .

మొదటి దశలో అప్పటి ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు రాష్ట్రంలో 60 చోట్ల వీటిని ప్రారంభించారు . 2014 ఎన్నిక సందర్భంగా చంద్ర బాబు చెప్పిన హామీని నెరవేర్చుకున్నారు . పేదలకు ఈ క్యాంటిన్లు అందుబాటులో ఉండి వారి ఆకలి తీర్చడం మొదలు పెట్టాయి . అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అన్న ఎన్టీఆర్ పేరు మీద ప్రారంభించిన ఈ క్యాంటిన్లు మూత పడ్డాయి .

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద వారికోసం ప్రారంభించిన ఈ క్యాంటిన్లు ను తిరిగి రాజన్న క్యాంటిన్లు పేరుతో మొదలు పెట్టె అవకాశం వుంది . అన్న క్యాంటిన్లు వున్న ప్రాంతాల్లో కాకుండా వీటిని వీరే చోట మొదలు పెట్టి ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది . మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై .ఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో పేద ప్రజలు కోసం క్యాంటిన్లు మొదలు కాబోతున్నాయి .