గుడికి వెళ్లి ప్రమాణం చేసిన అనీల్… లోకేష్ ని ఆడుకుంటున్న జిల్లా జనం!

యువగళం పాదయాత్రలో నారా లోకేష్ స్థానిక వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. తాను ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లా నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులిచ్చిన సమాచారం ప్రకారం వారిపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే కొంతమంది లోకేష్ ఆరోపణలు లైట్ తీసుకుంటున్నారు, మరికొందరు సీరియస్ గా తీసుకుని ఆ అపవాదు తొలగగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

అవును… పాదయాత్రలో భాగంగా ప్రతీ జిల్లాలోనూ స్థానికంగా బలమైన నేతలపై లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో మాజీమంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమర్ యాదవ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తనపై చేసిన అక్రమాస్తులు, అక్రమ వ్యాపారాల విమర్శలపై అనిల్ సీరియస్ గా స్పందించారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి ప్రమాణం చేసి వచ్చారు.

అనిల్ కి వెయ్యి కోట్ల రూపాయల అక్రమాస్తులున్నాయనేది లోకేష్ ఆరోపణ. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టెయ్యండన్నట్లు ఒక వర్గం మీడియా ఆ విమర్శలను, ఆరోపణలను తెగ హైలెట్ చేసింది. స్పెషల్ స్టోరీలు ప్రసారం చేస్తూ, స్పెషల్ ఆర్టికల్ అచ్చేస్తూ హడావిడి చేశారు. దీంతో అనిల్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

తనకు ఎలాంటి అక్రమ ఆస్తులు లేవని చెబుతూ… నమ్మనివారికోసం వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేస్తానన్నారు. దమ్ముంటే నువ్వుకూడా రా అంటూ లోకేష్ కి సవాల్ విసిరారు. ఇవన్నీ ఎందుకు నెల్లూరులో తనపై పోటీ చేసి గెలువు అంటూ మరో సవాల్ కూడా విసిరారు. అనంతరం అన్నమాటకు కట్టుబడి గుడికి వెళ్లి ప్రమాణం చేశారు. దీంతో బురదజల్లేసి తప్పించుకు తిరిగే లోకేష్ ఎక్కడ.. పరిపోయాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెల్లూరు వైసీపీ కార్యకర్తలు.

చిత్తశుద్ధి అంటే అనీల్ ది అని.. లోకేష్ లా అనిల్ పిరికిపంద కాదని పోస్టులు పెడుతున్నారు. దీంతో… లోకేష్ విమర్శలకు క్రెడిబిలిటీ మొత్తం పోయిందనే మాటలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తుండటం గమనార్హం.