దత్తపుత్రుడు మౌనానికి కారణం చెబుతున్న అనీల్… బాబుపై కీలక వ్యాఖ్యలు!

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీశాఖ జారీ చేసిన నోటీసులపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటివరకూ చంద్రబాబు కానీ, లోకేష్ కానీ స్పందించలేదు. ఇదే సమయంలో ఒక వర్గం మీడియా కూడా అసలు ఏమీ జరగనట్టే ఉండటం గమనార్హం. ఈ సమయంలో ఈ విషయంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు.

చంద్రబాబు నాయుడు లెక్కలు చూపించని 118 కోట్ల రూపాయలపై ఐటీ నోటీసులు అదించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే రాజకీయంగా పెను దుమారం లేవగా… వైసీపీ నేతలు చంద్రబాబుని ఫుల్ గా వాయించేస్తున్నారు. ఇప్పటికే కొడాలి నాని, రోజా, ధర్మాన ప్రసాద రావు, అమర్ నాథ్, పేర్ని నాని వంటి నేతలు లెఫ్ట్ & రైట్ ఇవ్వగా… తాజాగా అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.

తాజాగా ఈ విషయంపై స్పందించిన అనిల్ కుమారు… తాను సత్యహరిశ్చంద్రుడునని చెప్పుకునే చంద్రబాబు తన పీఏ ద్వారా ముడుపులు తీసుకున్నారనే విషయం తేటతెల్లమైందని.. అసలు ఈ నోటీసులపై ఆయన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏదో ఒకటి స్పందిస్తే ప్రజలకు మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

ఇదే సమయంలో జగన్ ఢిల్లీ వెళ్తే… ఇక్కడ ఫ్లైట్ ఎక్కినప్పటినుంచి, దిగే వరకూ మొత్తం రికార్డ్ చేసినట్లు చూపించే మీడియా సంస్థాలు.. ఇప్పుడు ఎందుకు మిన్నకున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో అవినీతిపై ప్రశ్నిస్తాను, ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని చెప్పుకునే పవన్‌.. చంద్రబాబు కు ఐటీ ఇచ్చిన నోటీసులపై కనీసం ఒక ట్వీట్ కూడా ఎందుకు చేయలేదని అనిల్ అడిగారు!

ఈ 118 కోట్ల రూపాయలల్లో పవన్ కల్యాణ్ వాటా ఎంతో కొంత ఉండే ఉంటుందని.. అందుకే ఈ విషయంపై షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా… కనీసం ట్వీట్ కూడా చేయకుండా మౌనంగా ఉన్నాడని, ఫలితంగా దత్తపుత్రుడు అనిపించుకున్నాడని అనీల్ కుమార్ ఫైరయ్యారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వ అప్పులపై సొంతలెక్కలు చెబుతూ మాట్లాడుతున్న పురందేశ్వరి ఈ నోటీసులపై ఎందుకు స్పందించడంలేదో చెప్పాలని అనిల్ అడిగారు.

ఇదే సమయంలో కమ్యునిస్టు పార్టీల నేతలపైనా అనిల్ స్పందించారు. చంద్రబాబుకు జారీ అయిన నోటీసులపై సీపీఐ నారాయణ, రామకృష్ణ వంటి నేతలు ఎందుకు స్పందించడంలేదో తెలియడం లేదని అన్నారు. దేశంలో ఏమి జరిగినా మైకులముందుకు వచ్చే ఈ ఇద్దరు ఎరుపు నేతలూ… ఈ విషయం గురించి తెలియలేదా.. తెలిసినా కూడా కావాలనే స్పందించడం లేదా అని అనిల్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఒక విన్నపం చేసిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… ఈ నోటీసులు జగన్ ప్రభుత్వం ఇచ్చినవి కావని, ఏపీ ప్రభుత్వం చంద్రబాబుపై కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతుందనే అభిప్రాయాలు తెచ్చుకోవద్దని సూచించారు. ఇది పూర్తిగా దత్తపుత్రుడు మద్దతు తెలిపిన బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ నోటీస్ అని అన్నారు!

అనంతరం… చంద్రబాబుకు వయసు అయిపోయిందని చెప్పిన అనిల్ కుమార్… చంద్రబాబు ఇంతకాలం చేసిన పాపాలకు పరిహారం చెల్లించాల్సిన సమయంలో ఉన్న్న్రని… ఇక్ ఆయనకు ఉన్న కొద్దిపాటి సమయంలో ఆయన చేఏ పని ఇదొక్కటే అన్ని అన్నారు.

ఏది ఏమైనా… చంద్రబాబు కు ఐటీ నోటీస్లు ఇవ్వడం, పైగా ఒకటి కాదు రెండు కాదు… ఇప్పటికి నాలుగు సార్లు పంపించడం… ఈ విషయంపై బాబ్బు & కో మౌనంగా ఉండటం చూస్తుంటే… వాస్తవాలు త్వరలో బయటపడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.