ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఛాన్స్ ఇస్తే వైసీపీపై, జగన్ పై విమర్శలు చేయడానికి అస్సలు వెనుకాడరనే సంగతి తెలిసిందే. ఈ వారం కొత్తపలుకులో ఆర్కే సీఎం జగన్ పని అయిపోయిందని పబ్లిసిటీ మొదలుపెట్టారు. ఆర్కే కొత్తపలుకులో 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశం లేదని వెల్లడించడం గమనార్హం. ప్రశాంత్ కిషోర్ సైతం వైసీపీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమని తెలంగాణకు చెందిన రాజకీయ నేతతో చెప్పారని ఆర్కే వెల్లడించారు.
జగన్ ఏం చేసినా 2024 ఎన్నికల్లో ఆయనకు అనుకూల ఫలితాలు రావడం కష్టమేనని ఆర్కే పేర్కొన్నారు. ఇకపై జగన్ కు అప్పులు పుట్టే అవకాశాలు కూడా లేవని ఫలితంగా జగన్ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు ఆగిపోయే అవకాశం అయితే ఉందని ఆర్కే కామెంట్ చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేయని పక్షంలో ప్రజల నుంచి జగన్ పై తిరుగుబాటు వచ్చే అవకాశం అయితే ఉందని ఆర్కే కామెంట్లు చేశారు.
అయితే అర్కే చెప్పిన విధంగా జరగదని వైసీపీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు కూడా రాధాకృష్ణ వైసీపీకి వ్యతిరేకంగా కథనాలను ప్రచారంలోకి తెచ్చారని అయితే అందుకు భిన్నంగా జరిగిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పథకాలను సరిగ్గానే అమలు చేస్తున్నా రాధాకృష్ణ మాత్రం అస్సలు మారడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆర్కే తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతూ బీజేపీని నిలువరించాలనే ఆలోచనతో కాంగ్రెస్ బలపడేలా చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సహకారం వల్లే కాంగ్రెస్ లో చేరికలు జరుగుతున్నాయని రాధాకృష్ణ తెలిపారు. అయితే ఆర్కే తన అభిప్రాయాలను జనం అభిప్రాయాలుగా వెల్లడించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.