ఏపీ కరోనా అప్డేట్ … తగ్గుముఖం పడుతున్న మహమ్మారి

Andhra pradesh corona cases update

ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 69,606 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,546 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 19,68,659 కి చేరింది. కరోనా కారణంగా చిత్తూరు 4, కృష్ణ 3, తూర్పుగోదావరి 2, గుంటూరు 2, అనంతపూర్ 2, నెల్లూరు 2, విశాఖపట్నం 1, శ్రీకాకుళం 1, ప్రకాశం 1 చొప్పున మొత్తం 18 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,428 కి చేరింది. రోజువారీ నమోదయ్యే కేసుల సంఖ్యను గమనిస్తే రాష్ట్రంలో మహమ్మారి విజృంభణ తగ్గుముఖం పడుతున్నట్లుగా ఉంది.

Andhra pradesh corona cases update
 

కరోనాబారి నుంచి నిన్న 1,940 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19,35,061 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 20,170 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,47,78,146 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే… అనంతపూర్-30, చిత్తూరు- 284, ఈస్ట్ గోదావరి-83, గుంటూరు- 130, కడప- 14, కృష్ణ- 259, కర్నూల్- 16, నెల్లూరు-186, ప్రకాశం- 185, శ్రీకాకుళం- 55, విశాఖపట్నం- 72, విజయనగరం- 27, వెస్ట్ గోదావరి-195 చొప్పున కేసులు నమోదయ్యాయి.

గమనిక: కరోనాను కట్టడి చేయాలంటే వాక్సిన్ తీసుకోవాలి. అంతేకాకుండా నిబంధనలను పాటించటం తప్పనిసరి.