వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన మోహన్ రెడ్డి పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. ఏడాదిగా మేనిఫెస్టో అమలుపైనే ఫోకస్ పెట్టి పనిచేసారు. ప్రజల ఇతర అవసరాలు తీర్చే పనిలోనే నిమగ్నమయ్యారు. ఇక కరోనా వచ్చిన తర్వాత తరుచూ జరిగే పనులతో పాటు కరోనాపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ రెండిట నడుమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. పార్టీ గురించి…జిల్లా స్థాయిలో పార్టీ ఎలా ఉందన్నది సమీక్షించే పరిస్థితి కూడా లేదు.
ఈ నేపథ్యంలోనే పార్టీలో అసమ్మతి సెగ రేగడం…జగన్ ని వ్యతిరేకించే వాళ్లు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి రాళ్లు వేయడం…జూనియర్లకు పదవులిచ్చారని, తమని పట్టించుకోలేదని సీనియర్లు ఆరోపణలు చేసారు. జిల్లా స్థాయిలో ఇంచార్జ్ వ్యవహారాలను జగన్ గాలికొదిలేసారు. దీంతో పార్టీలో కొంత మంది నేతల్లో అయితే అసంతృప్తి ఉంది. దాదాపు 13 జిల్లాల్లోనూ ఈ రకమైన సమస్యలైతే ఉన్నాయి. వీటిని తీర్చాల్సిన బాధ్యత జగన్ మోహన్ రెడ్డిపై ఉంది. ఆయన కాదని ఇతర సీనియర్లపై పెట్టినా వాటికి సరైన పరిష్కారం దొరకదు. ఇన్నాళ్లు అలాగే ఆ వ్యవహారాల్ని వాయిదా వేస్తూ వచ్చారు.
అయితే ఇప్పుడు కొత్త రాజధానులు ఏర్పాటుతో పాటు జిల్లాల ఏర్పాటు, అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కొత్త కార్పోరేషన్ల ఏర్పాటు కూడా జరుగుతోంది. కాబట్టి ఈసారి జగన్ పార్టీ వ్యవహారాలు సీరియస్ గా తీసుకోకపోతే పెద్ద ప్రమాదమే పొంచి ఉందని మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. అందరికీ సమన్యాయం చేయకపోతే నేతలు పార్టీలు మారే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు సొంత పార్టీ నేతల్లోనే ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎవరికి వారు లీడర్లగా, ఇంఛార్జ్ లుగా పీలైపోతున్నారు. జిల్లాల్లో..నియోజక వర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ఇదే కొనసాగితే వైసీపీ కి కష్ట కాలం తప్పదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.