ఏపీ శాసనసభ 2022–23 బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలతో శాసనసభ, శాసన మండలి సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు జారీ చేశారు. శాసనసభలో 2022–23 బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ నెల 11న ప్రవేశపెట్టనున్నారు.