Kinjarapu Atchannaidu : కింజరాపు అచ్చెన్నాయుడు జోకేశారు.. నవ్వరేం.!

Kinjarapu Atchannaidu :  కొన్నాళ్ళ క్రితం.. అదేనండీ, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సమయంలో ‘పార్టీ లేదు.. డాష్ లేదు..’ అనేసి, అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, తాజాగా చాలా పెద్ద జోక్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చనీ, తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు వస్తాయనీ సెలవిచ్చారాయన.

ఈ దశాబ్దానికే.. కాదు కాదు.. ఈ శతాబ్దానికే అతి పెద్ద జోక్‌గా దీన్ని అభివర్ణించాలి. రాజకీయ పార్టీలకు.. తమ గెలుపుపై నమ్మకం వుండాలి. ఆ నమ్మకం ఒకింత ఓవర్ అయినా ఫర్లేదు. కానీ, మరీ ఇంత దారుణమా.? మొత్తంగా వున్న 175 సీట్లలో, 160 సీట్లు టీడీపీకే వచ్చేస్తాయంటే నమ్మేదెలా.?

పైగా, అధికార వైసీపీ.. చాలా బలంగానే వుందింకా. తెలుగుదేశం పార్టీ తరఫున కాన్ఫిడెంటుగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఇప్పటికిప్పుడు ఎంత.? అంటే, ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది.

స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే టీడీపీకి భంగపాటు తప్పలేదు. మరెలా టీడీపీ, వైసీపీని ఎదుర్కోగలుగుతుంది.? ముక్కీ మూలిటీ ఈసారి ముప్ఫయ్ సీట్లైనా టీడీపీకి వస్తాయా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

చంద్రబాబు మెప్పు కోసం అచ్చెన్న ఇంత పెద్ద జోక్ చేసి వుండొచ్చుగానీ, నవ్వే ఓపిక టీడీపీ శ్రేణులకే లేదాయె. అయినా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎందుకొస్తాయ్.? వైఎస్ జగన్ ప్రభుత్వానికి బంపర్ మెజార్టీ వుంది. ఇంకో రెండేళ్ళ దాకా టీడీపీ ఎదురుచూడాల్సిందే.. మరో ఓటమి కోసం.!