‘ఆ నలుగురు’ ఎవరంటే.! చెప్పరుగాక చెప్పరు.!

ఉండవల్లి శ్రేదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. ఈ ఇద్దరి మీదనే వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. కానీ, పేర్లను గట్టిగా చెప్పలేని పరిస్థితి. మిగతా ఇద్దరూ ఇంకెవరరో కాదు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. అంతేనా.? ఇంకెవరైనా వున్నారా.? ప్రస్తుతానికైతే లిస్ట్ ఇంతే.! ఎవరైతే జగన్ మోహన్ రెడ్డిని మోసం చేస్తారో, వాళ్ళకి చరిత్రలో పుట్టగతులుండవ్.. అని అంటున్నారు వైసీపీ నేత, మంత్రి రోజా. ‘టీడీపీకి అమ్ముడుపోయారు..’ అంటూ ఆ నలుగురిపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిత్రంగా రోజా వెనుక ఆ వల్లభనేని వంశీ వున్నారు. ఆయన టీడీపీ ఎమ్మెల్యే. కానీ, ప్రస్తుతం వైసీపీలో వున్నారు.

రాజకీయాల్లో నాయకులు పార్టీలు మారడం వింతేమా కాదు. ప్రజా ప్రతినిథులుగా ఓ పార్టీలో గెలిచి, ఇంకో పార్టీలోకి దూకడాన్ని ‘మోసం’గా రోజా అభివర్ణించడం నిజమైతే, వల్లభనేని వంశీ కూడా మోసం చేసినట్లే కదా.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మోసం చేస్తే పుట్టగతులుండవ్.. చంద్రబాబుని మోసం చేస్తే మహానుభావులని రోజా చెప్పదలచుకున్నారా.?

వైసీపీ ఎంపీ భరత్ అయితే, ‘ఒక అమ్మకీ ఒక అబ్బకీ పుట్టి వుంటే.. వైసీపికి మోసం చెయ్యరు..’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయినా, ‘ఆ నలుగురు’ ఎవరో తెలిశాక, వారిపై పార్టీ పరంగా చర్యలుండాలి కదా.? రఘురామకృష్ణ రాజు మీదనే చర్యలు తీసుకోలేదు, ఆ నలుగురిపై చర్యలెలా తీసుకుంటారు.? ఇప్పటిదాకా ‘ఆ నలుగురు’ ఎవరన్నది వైసీపీ అధికారకంగా ప్రకటించలేకపోయింది. అంతటి నిస్సత్తువ వైసీపీలో ఎందుకు ఆవహించినట్లు.?