తెలుగుదేశం పార్టీ కంటే, జనసేనకే ఎక్కువ సీట్లు రాబోతున్నాయా.?

Janasena

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పూటకో సర్వే తెరపైకొస్తోంది. ఎవరు ఈ సర్వేలను చేస్తున్నారు.? ఏ ప్రాపతిపదికన సర్వేలు జరుగుతున్నాయి.? ఎక్కడ సర్వేలు చేస్తున్నారు.? ఎంతమందితో సర్వేలు నిర్వహిస్తున్నారు.? అన్నదానిపై స్పష్టత వుండటంలేదు.

సాధారణంగానే అన్ని రాజకీయ పార్టీలూ ఎప్పటికప్పుడు సొంత సర్వేలు చేయించుకుంటుంటాయి. వాటికి తోడు కొన్ని సంస్థలు కూడా సర్వేలు స్వచ్ఛందంగానే చేస్తుంటాయి. ‘ఆర్జన’ విషయంలో వాటి వ్యూహాలు వాటికి వుంటాయి.

తాజాగా వెలుగు చూసిన ఓ సర్వేలో, జనసేన పార్టీకి వచ్చే ఎన్నికల్లో టీడీపీ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని తేలిందంటూ రాజకీయ వర్గాల్లో ఓ బలమైన ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీకి 50కి పైగానే సీట్లు ఈసారి రాబోతున్నాయన్నది ఆ సర్వే సారాంశం. టీడీపీకి జనసేన కంటే తక్కువ సీట్లు.. అంటే, నలభై ప్లస్ వస్తాయని ఆ సర్వే చెబుతోందిట.

టీడీపీ వర్గాల్లో ఈ సర్వే హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా.. విడివిడిగా పోటీ చేసినా.. దాదాపు ఇదే రిజల్ట్ వుండబోతోందట. ఈ సర్వే ఫలితం వైసీపీలోనూ కలకలం రేపుతోంది. జనసేన అధినేత ధీమాకి ఈ సర్వేనే కారణమంటూ వైసీపీ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతుండడం గమనార్హం.

ఏమో, ఈ సర్వేల్నీ.. రాజకీయ ప్రచారాల్నీ ఇప్పుడే నమ్మలేం. ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు ఖచ్చితంగా భిన్నంగా వుంటాయ్.!