ఇదే రీజన్…?… పవన్ ప్రకటించిన ఆ ఐదు సీట్లలోనూ మార్పులు!!

ఒక మాంచి ముహూర్తం చూసుకుని టీడీపీ – జనసేన తమ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చంద్రబాబు 94 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించగా.. పవన్ కల్యాణ్ 5 అసెంబ్లీ స్థానాలకుగానూ జనసేన క్యాండిడేట్స్ ని ప్రకటించారు. అయితే ఈ ఐదు నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులు కన్ ఫాం కాదని.. మార్పు తప్పదనే చర్చ తెరపైకి వచ్చింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ – జనసేనలు తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన 5 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా… అనకాపల్లి అసెంబ్లీకి కొణతాల రామకృష్ణను తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో.. ఆయన ఇప్పటికే పనులు ప్రారంభించుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో… టీడీపీ మాజీ ఎమ్మెల్యే నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతుందని తెలుస్తుంది. దీంతో మార్పు తప్పదనే చర్చ మొదలైంది.

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ నుంచి 2014 ఎన్నికల్లో పోటీచేసి 22,341 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో 8,169 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన మరోసారి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని బలంగా కోరుకుంటున్నారు! అయితే అనూహ్యంగా పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించారు. దీంతో… పీలా & కో తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారని తెలుస్తుంది. వీరి ఫైర్ వల్ల జనసేన టిక్కెట్ తగలబడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదనే చర్చా మొదలైంది.

ఈ సమయంలో చంద్రబాబు ఎంటరయ్యారని.. పీలాకు సర్ధిచెప్పారని.. సహనం పాటించాలని కోరారని తెలుస్తుంది. ఈ సమయంలో సామాజిక సమీకరణల నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నాగబాబు పోటీ చేయడం లేదనే చర్చ తెరపైకి రావడంతో… అనకాపల్లిలో మార్పు తథ్యం అని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా… కొణతాల రామకృష్ణను జనసేన ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి బరిలోకి దింపే అవకాశం ఉందని.. ఆయన కోరిక కూడా అదే అని అంటున్నారు స్థానికులు!!

దీంతో… అనకాపల్లి ఎమ్మెల్యే టిక్కెట్ టీడీపీకి ఇచ్చి, ఎంపీ అభ్యర్థిగా కొణతాలను రంగంలోకి దింపే అవకాశాలున్నాయనే కొత్త అంశం తెరపైకి వచ్చింది. దీంతో… శుభమా అంటూ పవన్ ప్రకటించిన జనసేన అభ్యర్థుల తొలిజాబితాలో కూడా మార్పులు తప్పవని తెలుస్తుంది. మరో రెండు మూడు రోజుల్లో జనసేన అభ్యర్థుల మలి జాబితా ఉండొచ్చని.. ఆ సమయంలో ఈ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

దీంతో… ఇదే జరిగితే పొత్తు వ్యవహారంలో పవన్ వ్యవహారశైలి రోజు రోజుకీ దిగజారిపోతుందనే కామెంట్లు జనసైనికుల నుంచి వినిపించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు!