“కాశ్మీర్ కోసం ప్రాణ త్యాగం చేస్తా” – అమిత్ షా

“కాశ్మీర్ కోసం ప్రాణ త్యాగం చేస్తా” – అమిత్ షా

భారత పార్లమెంట్లో ఈరోజు కాశ్మీర్ అంశంపై హోమ్ శాఖా మంత్రి అయిత్ షా చాలా ఉద్విగ్నంగా మాట్లాడారు . నిన్న రాజ్య సభలో కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చెయ్యాలంటూ బిల్ ప్రవేశపెట్టి నినదించి అక్కడ బిల్ పాస్ చేయంచారు . నిజానికి బిజెపి కి రాజ్య సభలో బలం తక్కువ . అక్కడ పాస్ అయితే పార్లమెంట్ లో అడ్డే ఉండదు . ఈరోజు ఇదే బిల్ మీద మాట్లాడుతూ .. చాలా ఉద్వేగానికి గురయ్యాడు . అమిత్ షా ను ఎప్పుడు అంత కోపంగా , ఆవేశంగా చూడలేదు .

ఆర్టికల్ 370 రద్దు చెయ్యడం నిజంగా చారిత్రాత్మక విజయం . ఏడు దశాబ్దాలుగా రావణ కాష్టంలా వున్న కాశ్మీర్ సమస్యకు ప్రధాని నరేంద్ర మోడీ , అమిత్ షా శాశ్వత పరిష్కారం చూపించారు . కాశ్మీర్ ను కూడా భారత దేశం లో అంతర్భాగంగా చేశారు . ఇందుకు దేశ ప్రజలందరూ ఈ ఇద్దరు నేతలను అభినందనలు , ధన్యవాదాలు తెలుపుతున్నారు . నిన్నటి స్ఫూర్తి తో ప్రసంగిస్తున్న షా కు కాంగ్రెస్ వారు చిరాకు తెప్పించారు . దీంతో అమిత్ షా మండిపడ్డాడు . పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ కూడా మనదే అన్నాడు . ఈ మాటలు అందరిని షాక్ కు గురిచేశాయి అంతే కాదు కాశ్మీర్ కోసం అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తానన్నాడు . పార్లమెంట్ అవిచాలా ఉద్విగ్న క్షణాలు .

అమిత్ షా మాటలు భారత ప్రజల్లో కొత్త ఆశలను కలిగిస్తున్నాయి . ఏళ్ల తరబడి అటు పాకిస్తాన్ , ఇటు భారత దేశం మధ్య యుద్దాలకు దారి తీస్తున్న కాశ్మీర్ సమస్య పరిష్కారం అప్పుడు అయిపోలేదు .. జస్ట్ ఇది ప్రారంభం మాత్రామే అని అమిత్ పరోక్షంగా చెప్పాడు . మోడీ , అమిత్ ద్వయం తదుపరి యాక్షన్ ప్లాన్ ఏమిటో తెలిసిపోయింది .ప్రపంచం ఇప్పుడు భారత దేశం వైపు చూస్తుంది . ఇది శుభ పరిణామమే కదా !