ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని బెజవాడలో హాటాట్ చర్చనీయాంశమేమిటో తెలుసా… సిటి ట్రాఫిక్. బయటకు వెళ్లే ముందు, వెళ్లి వచ్చాక ఇళ్లలోఆఫీసుల్లో తరచూ వినబడే చర్చ ట్రాఫిక్.విజయవాడలో ఇపుడు బయటకు వెళ్లిన వాళ్లు రకరకాల ట్రాఫిక్ అనుభవాలతో తిరిగొస్తున్నారు. ఎక్కడో ఒక చోట ట్రాఫిక్ లో ఇరుక్కుపోకుండా ఇంటికి తిరిగొచ్చేవాళ్లు బాగా తక్కువ. ముఖ్యమంత్రి కే ఈ విజయవాడ ట్రాఫిక్ బెడద తప్పలేదు, మనమంతా అని ఇక్కడి జనం నిట్టూరుస్తున్నారు.
నగరంలో నానాటికి రోడ్ల మీద వాహనాల రద్దీ పెరిగిపోతున్నది. దానితో పాటే ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. బెజవాడలో ఇతర ప్రాంతాలనుంచి వచ్చి స్థిరపడే వారి సంఖ్య పెరిగిపోతుూ ఉంది. దానికి తోడు అమరావతి ప్రభావం కూడా తీవ్రంగా పడింది.రాజధాని పక్కనే ఉండటంతో ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా విపరీతంగా పెరిగింది.
దీనితో నగరంలో ట్రాఫిక్ స్థంభిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక నగరానికి గుండెకాయ లాంటి బెంజ్ సర్కిల్ ప్రాతంలో సమస్య మరింత జటిలంగా తయారయింది. ఇక్కడ అంబులెన్స్ కు కూడా దారి దొరక్క ట్రాఫిక్ లొనే ఇరుక్కున్న సంఘటనలు చాలా ఉన్నాాయి. అందులో ఇదొకటి. ఇది ఈ రోజు జరిగింది. పకీరు గూడెం నుండి రమేష్ హాస్పిటల్ వైపు బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ జామ్ కావడం మామాలయింది . ఈరోజు ఈ ట్రాఫిక్ జామ్ లో అటుగా వెళ్తున్న అంబులెన్స్ సుమారు 5 నిముషాల పాటు చిక్కుకు పోయింది.
కొసమెరుపు: నిన్న సాయంత్రం ఇదే కూడలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు కాన్వాయ్ కూడా ఇరుక్కుపోయింది.