ఎక్స్ క్లూజివ్: అంబటి రాయుడు రాక… మరోనేత వర్గంలో కాక!

ఇంతకాలం ట్విట్టర్ లోనూ, ఇన్స్ స్టా గ్రాం లోనూ జగన్ ను ప్రశంసిస్తూ వచ్చిన క్రికెటర్ అంబటి రాయుడు.. తొలిసారి వైఎస్ జగన్ ను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. దీంతో ప్రస్తుతం గుంటూరు రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. దీంతో… అంబటి రాయుడు జగన్ ని కలుసుకోవడంపై గుంటూరు జిల్లాకు చెందిన మరోనేత వర్గం కాకెత్తిపోతుందని తెలుస్తుంది!

అంబటి రాయుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని సీఎం క్యాంప్ అఫీసులో కలిశారు. ఈ సందర్భంగా ఆయన సీఎంతో చాలా విషయాలు చర్చించినట్లుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా… రాష్ట్రంలో క్రీడలు వాటి అభివృద్ధి, యువతకు అవకాశాలు, శిక్షణ మొదలైన అంశాలపై సీఎం తో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌.. రాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదంతా అధికారికంగా బయటకు వచ్చిన విషయం. అయితే అధికారికంగా వెలుగులోకి రాని మరో విషయం మీడియా సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది! అంబటి రాయుడు ఇప్పటికే తనకు రాజకీయాలంటే ఆసక్తి ఉందని, తాను రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తానని, యువకులు రాజకీయాల్లోకి రావాలనే మాటలకు తాను ఆకర్షితుడిని అయ్యానని చెబుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అంబటి రాయుడి ఉత్సాహానికి జగన్ మద్దతు పలికారని తెలుస్తుంది! ఈ మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీచేసే అవకాశం కల్పిస్తానని భరోసా ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో… నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయుల వర్గం.. రకరకాల గాసిప్పులు ఊహించుకుంటూ హర్ట్ అవుతున్నారని సమాచారం!

గతకొంతకాలంగా సరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు కొన్ని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కథనాలొస్తున్నాయి. పైగా జనసేన కేడర్ తో కలిసి పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడంతోపాటు, నిర్వహించారనే ఫిర్యాదు కూడా ఉంది! ఈ నేపథ్యంలో… జగన్.. శ్రీకృష్ణ దేవరాయులుకి హ్యాండ్ ఇచ్చి… ఆ స్థానంలో అంబటి రాయుడిని తీసుకురాబోతున్నారా అని టెనన్స్ లో ఉన్నారంట.

అయితే… గడిచిన గుంటూరు లోక్ సభ స్థానానికి వైసీపీ నుంచి పోటీచేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.. ప్రస్తుతం పెద్దగా యాక్టివ్ గా లేరని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ స్థానం నుంచి అంబటిని పోటీకి నిలబెట్టే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారంట మరో బ్యాచ్. దీంతో… పైకి కాస్త ప్రశాంతంగానే అనిపిస్తున్నా… లోలోపల మాత్రం అంబటి రాయుడి తాడేపల్లి రాకతో మొదలైన కాక అలానే కంటిన్యూ అవుతుందని అంటున్నారట శ్రీకృష్ణ దేవరాయుల టీం! మరి ఈ అనుమానాలు, గాసిప్పులు… ఎలాంటి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తాయన్నది వేచి చూడాలి!