“బ్రో” సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టి పవన్ చేసిన పనికి మంత్రి అంబటి రాంబాబు చాలా హర్ట్ అయ్యారని అంటుంటారు. అది అవునో కాదో తెలియదు కానీ… నాటి నుంచి పవన్ కల్యాణ్ పై అంబటి దూకుడు రెట్టింపు అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ పేరు చెబితే అంబటి అంతెత్తున లేచి పడిపోతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాలయ్యపైనా ఫైరయ్యారు.
ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాకత్ అనంతరం టీడీపీతో పొత్తు ప్రకటించారు చంద్రబాబు. అనంతరం తాజాగా అవనిగడ్డ నియోజకవర్గంలో వారాహియాత్ర చేపట్టారు. ఇప్పటికే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు విశాఖ జిల్లాల్లోనూ యాత్ర పూర్తి చేపట్టిన ఆయన… పొత్తు అనంతరం మొదటిసారిగా కృష్ణాజిల్లా అవనిగడ్డలో వారాహి సభ నిర్వహించారు.
ఈ సమయంలో వారాహి తాజా షెడ్యూల్ పై మంత్రి అంబటి రాంబాబు తవైన స్టైల్లో పంచ్ లు విసిరారు. ఇందులో భాగంగా… “వారాహి యాత్ర + యువగళం = వరాహగళం” అంటూ ట్వీట్ వేశారు. వారాహి వాహనంపై మొదటినుంచీ విమర్శలు చేస్తూనే ఉన్న అంబటి… ఇప్పుడు ఆ వారాహికి యువగళం తోడైతే అది వరాహగళం అంటూ మరోసారి సెటైర్లు పేల్చారు. అనంతరం పొలిటికల్ లెక్కలు చెప్పారు మంత్రి.
ఇందులో భాగంగా… ఏపీలో మారిన రాజకీయ సమీకరణాలతో తమకు వచ్చిన నష్టమేమీ లేదంటున్న మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ, జనసేన కలసినా కూడా వైసీపీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని తేల్చి చెబుతున్నారు. ఈ సందర్భంగా మరో ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా… “1+1 = 2 గణితంలో… కొన్నిసార్లు రాజకీయాలలో 1+1 = 0 అవుతుందని ఫ్లాప్ అయిన అవనిగడ్డ “వరాహగళం” నిరూపించింది!” అని ట్వీట్ చేశారు.
అంటే… టీడీపీ, జనసేన కలసినా కూడా ఫలితం లేదని.. ఆ రెండు పార్టీలు కలసినా ఫలితం గుండు సున్నా అంటూ సెటైర్లు పేల్చారు అంబటి. “జైల్లో పడ్డ అవినీతి పరుడు దీక్ష చేస్తుంటే మహాత్ముడి ఆత్మ క్షోభిస్తుంది! హే రామ్!” అంటూ తాజాగా ఈ రోజు చంద్రబాబు జైల్లో 10 ఏఎం – 5 పీఎం చేస్తున్న నిరసన దీక్షపై స్పందించారు.