జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ అధికార పార్టీలో సెటైర్స్ వేసేవారిలో అంబటి రాంబాబు స్టైలే వేరని అంటుంటారు. దానికి తగ్గట్లుగానే పవన్ చేసిన సంచలన వ్యాఖ్యలపై చిన్న ట్వీట్ తో పంచ్ వేసి వదులుతుంటారు అంబటి. అంబటి సెటైర్స్ కి అనంతరం జనసేన నుంచి రిప్లై లు ఉండకపోతుండటం గమనార్హం.
అవును… జనసేన అధినేత పవన్ పై అంబటి రాంబాబు వేసే సెటైర్లు మాములుగా ఉండవు అని అంటుంటారు. ఈ సమయంలో తాజాగా విడుదలైన పవన్ సినిమా… “బ్రో”లో పృథ్వి చేసిన శ్యాంబాబు పాత్రతో ఏపీ మంత్రి అంబటి రాంబాబును పరోక్షంగా టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్! దీంతో పొలిటికల్ గా అంబటిపై సెటైర్స్ వేయలేక, తిరిగి వేయించుకోలేక… ఇలా సినిమాలో వన్ సైడ్ గా సెటైర్ వేసుకుని హ్యాపీ ఫీలయ్యారని అంటున్నారు.
“బ్రో” సినిమాలో మొదట శ్యాంబాబు పాత్ర మామూలు పాత్ర గానే కనిపించినప్పటికీ.. “మై డియర్ మార్కండేయ” పాట చూస్తే అది ఏపీ మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ పెట్టిన క్యారెక్టర్ గా కనిపిస్తుంది. దీంతో ఈ పాటలో శ్యాంబాబు పాత్రపై సెటైర్లు పేలుతున్నాయి. ఈ పాటలో పృద్వి గెటప్, వేసిన కాస్ట్యూంస్, స్టెప్పులు చూస్తే కచ్చితంగా ప్రతి ఒక్కరికి అంబటి రాంబాబు గుర్తొస్తారని అంటున్నారు!
కాగా… ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలలో భాగంగా అంబటి రాంబాబు వేసిన స్టెప్పులు తాలూకు వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అటువంటి టీ షర్ట్ ని ధరించి, అంబటి రాంబాబు లానే స్టెప్పులు వేయించి శ్యాంబాబు క్యారెక్టర్ తో అంబటి రాంబాబును ఇమిటేట్ చేయించారు!
అయితే ఈ వీడియో బైట్ వైరల్ అవుతోంది. దీంతో… అంబటి ఆన్ లైన్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు సెటైర్ వేశారు. “గెలిచినోడి డాన్స్ సంక్రాంతి! ఓడినోడి డాన్స్ కాళరాత్రి!” అంటూ టార్గెట్ చేసిన అంబటి రాంబాబు.. పవన్ కళ్యాణ్ ని ఈ పోస్ట్ కు ట్యాగ్ చేశారు.
దీంతో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన విషయాన్ని మరోసారి అంబటి గుర్తుచేశారని… మానిన గాయాన్ని మరలా రేపారని… ఫలితంగా పవన్ కు నిజంగానే కాళరాత్రి లాంటి గతాన్నిఒ గుర్తుచేశారని అంటున్నారు అంబటి అభిమానులు. ఏది ఏమైనా ఈ విషయంపై అంబటి మైకుల ముందు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
Ambati Rambabu Same to same #BRO🤙🤙#BroTimeStarts #BroTheAvatar pic.twitter.com/Esw8xXHwRL
— Chandu@PSPK✊😎 (@ChanduPSPK9999) July 28, 2023
గెలిచినోడి డాన్స్ సంక్రాంతి !
ఓడినోడి డాన్స్ కాళరాత్రి !@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) July 29, 2023