జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పచ్చ మీడియా టార్గెట్ చేసిందిన్నది అందిరికీ తెలిసిన వాస్తవం. జగన్ చేసిన మంచిని సైతం చెడుగా చూపించడానికి ఎంత మాత్రం ఆ వర్గం మీడియా ఆలోచించదు. ఏడాది పాలనలో అలాంటి ఎల్లో కథనాలెన్నో వెలవడ్డాయి. అచ్చు వేసి మరీ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసాయంటే? ఆ పత్రికలు..ఛానళ్లు ఎంతగా దిగజారిపోయాయో! తెలుస్తున్నదే. వైసీపీ అనుకూల మీడియా వేసిన కథనాలపై విషం చిమ్మి తమకు అనుకూలంగా మార్చుకున్న సందర్భాలెన్నో. వాటికి జగన్ మీడియా అంతే ధీటుగా బధులిచ్చిందనుకోండి.
అయితే జగన్ మంత్రి వర్గంలో..అధికారుల్లో బ్లాక్ షీప్ లు ఉన్నాయని చాలా కాలంగానే వినిపిస్తోంది. జగన్ చేయాలనుకున్నది ముందే బయటకు పొక్కడం తద్వారా వాటిని ప్రజల్లోకి నెగిటివ్ చేయడం వంటివి కొన్ని నెలలుగా జరుగుతున్నదే. ఇప్పటికే ఇద్దరు మంత్రులకు స్ర్టాంగ్ వార్నింగ్ లు కూడా వెళ్లినట్లు ప్రచారం సాగింది. ఇలాంటి కథనాల వల్ల జగన్ యంత్రాంగంపై కొంత దెబ్బ పడిందన్నది వాస్తవం. అయితే ఇప్పటివరకూ జరిగింది వేరు. ఇకపై జరగబోయేది వేరు. రాజధానుల విషయాలు గానీ, సీఆర్ డీ ఏ బిల్లు రద్దు విషయాలు సహా పలు అంశాల్లో గోప్యంగా వ్వవహరించాల్సి ఉందని అధికారులను జగన్ ఆదేశించినట్లు సమాచారం.
అధికారికంగా ప్రభుత్వం నుంచి ప్రెస్ రిలీజ్ వెళ్లే వరకూ చిన్న విషయం కూడా బయటకు పొక్కకూడదని ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొంత మంది మంత్రుల, ఎమ్మెల్యేలు, అధికారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు లీకులందుతున్నాయి. మరి ఈ తప్పిదాలు ఎలా చోటుచేసుకున్నాయో! ఆ మధ్య సొంత పార్టీలో అసమ్మతి సెగ రేగిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేతలే జగన్ పై గుసాయించే ప్రయత్నం చేసారు. ఈ సమయంలో లీకులు ఎక్కువైనట్లు మీడియా కథనాలు వేడెక్కించాయి. మరి వీటన్నింటిపై జగన్ ఈ సారి నిఘా పెట్టారు కాబట్టి ఇంటిదొంగలెవరో బయట పడే అవకాశం కనిపిస్తోంది.