AP : 2024 ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాలలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వైసిపి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఎంతో మంది కీలక నేతలు ఈ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇక వైసిపికి జగన్ మోహన్ రెడ్డి తర్వాత అంతటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ సాయి రెడ్డి అని మాత్రమే చెప్పాలి.
ఇక విజయ సాయి రెడ్డి కూడా ఏకంగా రాజకీయాలకి దూరం కాబోతున్నానంటూ ఈయన తన రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశారు అనంతరం వైసిపి పార్టీకి కూడా రాజీనామా చేశారు ఇల రాజకీయాలు నుంచి తప్పుకొని తాను వ్యవసాయం చేస్తానంటూ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈయన రాజీనామా చేసినప్పటికీ కూడా అంతర్గతంగా రాజకీయాలలో పాల్గొంటున్నారని తెలుస్తుంది. అయితే విజయ్ సాయి రెడ్డి రాజీనామా, ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లడం అనేది జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే జరుగుతుందని తెలుస్తుంది.
ఇక ఇటీవల హైదరాబాద్ కి ఉపరాష్ట్రపతి రావడంతో స్వాగతం పలకడం కోసం విజయసాయి రెడ్డి కనిపించడంతో ఈయన తిరిగి రాజకీయాలలోకి రాబోతున్నారని బిజెపిలోకి చేరబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లారని… ఆయన జూన్ లేదా జులైలో బీజేపీ లో చేరతారని… బీజేపీలో కూడా ఆయన కీ రోల్ పోషిస్తారని కూటమి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఇలా వైఎస్ఆర్సిపి పార్టీని వదిలిపెట్టి ఈయన బిజెపిలోకి వెళ్లడం వెనుక జగన్ ప్రమేయం ఉందా అంటే ఉందనే తెలుస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పై ఎన్ని కేసులు అయితే ఉన్నాయో అన్ని కేసులు విజయసాయిరెడ్డి మీద కూడా ఉన్నాయి. జగన్ A1 ముద్దాయి కాగా విజయసాయిరెడ్డి A2 గా ఉన్నారు. ఇలా ఈ కేసుల నుంచి సురక్షితంగా ఉండటం కోసమే జగన్ ఇలాంటి వ్యూహాన్ని రచించారు అంటూ మరికొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ సాయి రెడ్డి పొలిటికల్ యూటర్న్ మాత్రం అందరిలో పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది.