Doors Closed For YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యులు కావొచ్చు, మంత్రులు, ముఖ్యమంత్రి కావొచ్చు.. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్పగలుగుతారు.?
రాష్ట్ర రాజధాని విషయమై ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు వైసీపీ ప్రభుత్వం, తాము చేసిన చట్టాన్నే వెనక్కి తీసుకుంది. కొత్త బిల్లు పెట్టడానికి పరిస్థితులు అనుకూలించవు. గతంలో అమరావతి విషయమై రాజకీయ విమర్శలు చేసినట్లు, ఇప్పుడు కూడా ప్రభుత్వం అవే విమర్శల్ని అసెంబ్లీ సాక్షిగా చేయాలనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
అయ్యిందేదో అయిపోయింది, అమరావతి అభివృద్ధి కోసం తాము ఏం చేయదలచుకున్నదీ అసెంబ్లీ సాక్షిగా చెప్పడమే ప్రభుత్వానికి హుందాతనం. కానీ, అలా చెప్పాలంటే ‘అహం’ దెబ్బతింటుంది. చెప్పకపోతే మరింతగా ప్రభుత్వ పెద్దలు ప్రజల్లో అభాసుపాలైపోతారు.
ఒక్క మాటలో చెప్పాలంటే, వైసీపీ ప్రభుత్వానికి అన్ని దారులూ మూసుకుపోయాయి.. (All Doors Closed For YSRCP) అన్ని తలుపులూ మూసుకుపోయాయి. అసలు అసెంబ్లీ మొహమే చూడకూడదనుకున్న టీడీపీ, అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యిందంటే.. వైసీపీ అడ్డంగా బుక్కయిపోయిందని.
ప్రస్తుతం అధికార పార్టీ ముందున్నది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎదురుదాడి వ్యూహమే. అదెప్పుడూ వైసీపీ అయినా, ఇంకో పార్టీ అయినా చేస్తుంటుందనుకోండి.. అది వేరే సంగతి. కానీ, అదైనా వైసీపీకి కలిసొస్తుందా.? కష్టమే.!