పవన్ పై పోటీకి సిద్ధమంటున్న అలీ.. శత్రుత్వానికి అసలు కారణం ఇదేనా?

2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. ప్రధానంగా గాజువాక, భీమవరం, పిఠాపురం, కాకినాడ రూరల్ నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. అయితే సీఎం ఆదేశిస్తే పవన్ పై పోటీకి సిద్ధమేనని అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్ లో విమర్శలకు ప్రతి విమర్శలు సాధారణం అని అలీ తెలిపారు.

అలీ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధం అని అలీ చేసిన కామెంట్లపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ వల్లే అలీ ఈ స్థాయికి ఎదిగాడని పవన్ కు అలీ వెన్నుపోటు పొడుస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. తన కూతురి పెళ్లికి పవన్ హాజరు కాకపోవడం వల్లే ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు.

జనసేనలో చేరి ఉంటే అలీకి మంచి భవిష్యత్తు ఉండేదని పదవుల కోసం ఆశపడి అలీ స్నేహితులకు ద్రోహం చేశారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అలీ మూలాలను మరిచిపోతున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అలీ ప్రస్తుతం సినిమా ఆఫర్లు తగ్గడంతో రాజకీయాలపై దృష్టి పెట్టారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కామెంట్ల విషయంలో అలీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. అలీ వైసీపీకి పాజిటివ్ గా ఎన్ని పనులు అయినా చేసుకోవచ్చని అయితే పవన్ కు వ్యతిరేకంగా అడుగులు వేయడం మాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలీ శత్రుత్వాన్ని వీడి అందరివాడిగా మంచి పేరును సంపాదించుకుంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.