కాశ్మీర్ లో పరిస్థితులు ఎలా వున్నాయి ?
భారతదేశ భద్రతాదళాల ముఖ్య సలహాదారు అజిత్ దోవల్ ప్రతిభ , ప్రణాళిక ,వ్యూహాలను అమలు చెయ్యడంలో ఆయన చూపించిన సాహసం ,తెగువ అనితర సాధ్యం . అజిత్ దోవల్ మనదేశానికి పెద్ద ఎస్సెట్ . అందుకే ప్రధాని నరేంద్ర మోడీ ఏరి కోరి ఆ పదవిలో నియమించాడు . త్రివిధ దళాలను నడిపించడంలో అజిత్ దోవల్ ఎప్పుడు విఫలం కాలేదు . కాశ్మీర్ ను మనదేశం నుంచి వేరు చేస్తున్న ఆర్టికల్ 370, 35A లు రద్దు చెయ్యాలన్న ఆలోచన వచ్చిన నాటి నుంచి … కాశ్మీర్ లో శాంతి భద్రతలు చేజారి పోకుండా పటిస్టమైన వ్యూహ రచన చేసి లక్షమంది కి పైగా భరత్ సైనికులను సున్నినమైన , సమస్యాత్మక ప్రాంతాల్లో దించారు . అమర్నాథ యాత్రికులను ఆఘమేఘాలపై వెనక్కు పిలిపించారు . స్కూల్స్ కు సెలవు ప్రకటించారు . 144 సెక్షన్ విధించిన తరువాత అప్పుడు రాజ్య సభలో బిల్ ప్రవేశపెట్టారు .
కాశ్మీర్ నివురుగప్పిన నిప్పులా వుంది . పాకిస్తాన్ మాత్రం తన వుక్రోశాన్ని చాటుకుంది . అయినా కాశ్మీర్ మన దేశ అంతర్గత విషయం కాబట్టి దీనిపై కనీసం స్పందించలేదు . ఈ నేపథ్యంలో అజిత్ దోవల్ కాశ్మీర్ లోయలో పరిస్థితులను అంచనా వెయ్యడాని వెళ్లారు. పోషియన్ జిల్లాలో దోవల్ స్థానికులతో సమావేశమై వారి అభిప్రాయలు తెలుసుకున్నారు . ఆర్టికల్ 370 రద్దువల్ల కాశ్మీరీల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తాయని , యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని , ప్రజల జీవితం శాంతి యుతంగా సాగుతుందని నచ్చచెప్పాడు . అంతేకాదు మధ్యాహ్నం కావడంతో రోడ్ పక్కన వున్న చిన్న భోజనము హోటల్ స్థానికులతో కలసి భోజనం చెయ్యడం అందరి దృష్టిని ఆకట్టుకుంది . దోవల్ గ్రౌండ్ రియాలిటీ ని మాచిపోని వ్యక్తి . అందుకే ప్రజలతో కలసిపోయి వాస్తవాలు గ్రహిస్తూ ఉంటాడు .