ఉగ్రవాదానికి ఎక్కువగా యువకులు ఆకర్షితులవుతుంటారు. అయితే.. వాళ్లు టెర్రరిస్టులుగా మారాక.. వాళ్ల కుటుంబ పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. తమ కుటుంబాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. ఉగ్రవాదంలో చేరి.. సొంత దేశానికే ద్రోహం చేసే ఎంతోమంది యువకులను మనం చూస్తూనే ఉన్నాం.
అయితే.. తాజాగా జమ్మకశ్మీర్ లో ఉగ్రవాదిగా మారిన ఓ యువకుడు ఇండియన్ ఆర్మీకి లొంగిపోయాడు. ఓ స్పెషల్ ఆఫీసర్ ఏకే 47 తుపాకులను జహంగీర్ అన యువకుడు ఎత్తుకెళ్లాడు. ఆ యువకుడు ఉగ్రవాదిగా మారాడు. ఆ యువకుడు కనిపించకుండా పోయేసరికి అతడి కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. తన కొడుకు గురించి ఆర్మీకి కూడా సమాచారం అందించారు.
అయితే.. తాజాగా ఓ ఆపరేషన్ లో ఆ యువకుడిని గుర్తించింది ఆర్మీ. వెంటనే అక్కడిని తన తండ్రిని తీసుకొచ్చి.. లొంగిపోవాలంటూ సూచించారు. ఏకే 47 గన్స్ కింద పడేసి వచ్చి లొంగి పోవాలని.. తన తండ్రి కూడా అక్కడే ఉన్నట్టు చెప్పారు.
జవాన్లు హామీ ఇవ్వడంతో.. వెంటనే ఆ యువకుడు తన దగ్గర ఉన్న గన్స్ కింద పడేసి చేతులెత్తుకుంటూ వచ్చి లొంగిపోయాడు.
అచ్చం సినిమాలోని సీన్ ను తలపించేలా ఉన్న ఈ లొంగుబాటుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు… ఇండియన్ ఆర్మీని ప్రశంసిస్తున్నారు.
#ChinarCorps #AwaamKeLiye
One SPO went missing with two AK-47 on 13 Oct 20.Same day Jahangir Bhat from Chadoora had gone missing .Today he was apprehended with one AK rifle.kudos to soldiers of @ChinarcorpsIA for handling the situation professionally @NorthernComd_IA pic.twitter.com/r0mVooR0f4— Southern Command INDIAN ARMY (@IaSouthern) October 16, 2020