ముగ్గురు ఆంధ్రా మంత్రులు, మూడు ప్రశ్నలు, ఏమా కథ

మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి తన పార్టికేే చెందిన ముగ్గరు నేతలకు,అందునా మంత్రులకు ముచ్చెమటలు పట్టించారు. ఇది ఇపుడు నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద రచ్చవుతున్నది. మొన్న జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన  వేసిన మూడు ప్రశ్నలు,ఎందుకీ పశ్నలు వేశాడని పార్టీ నాయకులకే ప్రశ్నార్ధకమయ్యాయి. ముగ్గురు మంత్రులు నారాయణ, అమర్ నాధ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమన్వయ కమిటీ సమావేశంలో ఆదాల ముచ్చటగా మూడంటే మూడే ప్రశ్నలు వేశారు. ఆదాల నుంచి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని వూహించిన ముగ్గురు మంత్రులకు, వాటికి సమాధానాలు చెప్పలేక చెమటలు పట్టాయట.

ఏపీకి ప్రత్యేకహోదాపై నరేంద్రమోడీ ఇచ్చిన హామీలపై మనం మాట్లాడుతున్నాం, గొడవ చేస్తున్నాం, పార్లమెంటులో ధర్నాలుచేస్తున్నాం, ఏకంగా మోదీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టి సంచలనం సృష్టించాం, చాలా బాగుంది. ఈసందర్భంగా నాకొక మూడు ప్రశ్నలు గుర్తొస్తున్నాయి, వాటికి సమాధానం చెబితే చాలని అడిగారట.

ఆదాల ప్రభాకర్ రెడ్డి వేసిన మూడు ప్రశ్నలివే:

1. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మనం ప్రధాని మోదీని నిలదీస్తున్నాం. మరి, మనం నెల్లూరు జిల్లలా ప్రజలకు ఇచ్చిన హామీలేమయినాయని గురించి ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్పాలి ?

2.ముఖ్యమంత్రి ఈ జిల్లా అభివృద్ది విషయంలో ఇచ్చిన హామీలుచాలా ఉన్నాయి, అవి ఎంతవరకు నెరవేర్చారని నిలదీస్తే మనం ఏం బదులు చెప్పాలి ?

3. అన్ని హామీలిచ్చారు ఆరోజు. నాలుగేండ్లుగడిచింది, వాటిని  అమలు మీరేం చేస్తున్నారు అని ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్పాలి ? ముందు వాటికి సమాధానం చెప్పండి అంటూ ఆదాల సమావేశంలో నిలదీశారని ఇపుడు లీకయింది.

టీడీపీలో ఆదాల కీలకమైన నాయకుడు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాదాపు మూడు నియోజకవర్గాల్లో బాాగా నెట్ వర్క్  వున్న నేత ఆదాల.

అయితే, పార్టీలోఆయన్నెవరూ పెద్దగా పట్టించుకోరు.  తనకి  పార్టీలో తగిన  గౌరవం లేదన్న  బాధ ఆయనలోనే కాదు ఆయన వర్గీయుల్లోనూ ఉంది. పార్టీలో వివాదాలకు అవకాశం లేని వ్యక్తి అయినా, తనకు పార్టీ ఎందుకు సముచిత గౌరవం ఇవ్వడంలేదని ఆయన అనుచరులు ప్రశ్నిస్తుంటారు.

పార్టీ నాయకత్వంలో తన పట్ల మార్పు రావడం లేదన్న అసంతృప్తితో   ఆయన వైసీపీలో చేరతారన్న ప్రచారం కూడా ఉండింది.

అలాంటి అవకాశమే లేదని ఆయనే కుండబద్దలు కొట్టినా ఎవరూపెద్దగా నమ్మడం లేదు. ఆయన అవకాశం కోస ఎదురుచూస్తున్నారని అందరి అనుమానం.

ఈ నేపధ్యంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి  జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చని విషయం గుర్తుచేసి ప్రజలేమనుకుంటుంటారో ఆలోచించండని  మంత్రులకు సలహా  ఇవ్వడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.