ఏంటి పృధ్వీ మరీనూ.! ఇలాగైతే ఎలా.?

Actor Prudhvi

సినీ నటుడు, ఒకప్పటి వైసీపీ నేత పృధ్వీకి ఇప్పుడు వున్నపళంగా తన కులం గుర్తుకొచ్చింది. తాను ‘కాపు’ కులానికి చెందిన నిఖార్సయినవాడినని చెప్పుకుంటున్నాడాయన. 2019 ఎన్నికల మయంలో పృధ్వీ వైసీపీలో చేసిన హంగామా అంతా ఇంతా కాుద. వైఎస్ జగన్ వెంట పాదయాత్రలోనూ అక్కడక్కడా కనిపించాడాయన. వైసీపీకి పృధ్వి అందించిన ‘సేవల’ నేపథ్యంలో ఆయనకు టీటీడీ చానల్ బాధ్యతల్ని వైఎస్ జగన్ అప్పగించిన సంగతి తెలిసిందే.

కానీ, ‘వెనకనుంచి వాటేసుకున్న’ వ్యవహారం, పృధ్వీని ఆ ఛానల్ నుంచి బయటకు గెంటేసేలా చేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళు ‘మౌనంగా రోదించిన’ పృధ్వీ, క్రమంగా కోలుకుని, సినిమాల్లో బిజీ అయి, మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జనసేన తరఫున ఈసారి కొత్తగా వకాల్తా పుచ్చుకుంటున్నాడు.! పృధ్వీ వైసీపీ కోవర్టేనా.?

పృధ్వీ ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తేశారు. వైసీపీ పట్ల విపరీతమైన మమకారం ప్రదర్శించాడు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. ఇప్పుడైతే వైసీపీని టెర్రరిస్టుల్ని తయారు చేసే ఫ్యాక్టరీగా పృధ్వీ అభివర్ణిస్తున్నాడు. బహుశా ఆయన కూడా అప్పట్లో వైసీపీలోనే ‘తీవ్రవవాద’ ఫాఠాలు నేర్చుకున్నట్టున్నాడు.

పృధ్వీని జనసేన పార్టీ తన వెంట తిప్పుకోవడంలేదు. ఆయన్ని వైసీపీ కోవర్టుగానే జనసైనికులు అనుమానిస్తున్నారు. కాకపోతే, వైసీపీని విమర్శించేవాళ్ళకి సహజంగానే టీడీపీ అలాగే జనసేన, ఇంకోపక్క బీజేపీ నుంచి సోషల్ మీడియా వేదికగా మద్దతు దొరుకుతుంటుంది కదా.?