ఎల్లో మీడియా జోరు ఇంకా తగ్గలేదు. ఆర్కే జగన్ మీద ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు జగన్ మీద తప్పుడు రాతలు రాద్దామా అనే ధోరణిలోనే ఉన్నాడు. జగన్ ఏం చేసినా, ఏం మాట్లాడినా తప్పులు వెతుకుతూ ఒకవేళ తప్పులు దొరక్కపోతే తప్పులున్నటు ప్రాజెక్ట్ చేస్తున్నారు. కొత్త పలుకుల పెయుతో చెత్త పలుకులు పలుకుతూనే ఉన్నారు. తాజాగా ఆర్కే జగన్ చేసిన ఒక వ్యాఖ్యను పట్టుకుని తన పత్రికలో పేరాలకు పేరాలు పాచి అబద్దాలను వండి వార్చాడు. జగన్ కొన్ని రోజుల క్రితం తన ప్రభుత్వం మీద గెరిల్లా యుద్ధం జరుగుతోందని అన్నారు. ఆ మాటను పట్టుకుని ప్రతిపక్షాలకు నిజంగానే గెరిల్లా యుద్ధమే చేయమని ఉచిత సలహా ఒకటి ఇచ్చేశారు ఆర్కే.
దేవాలయాల మీద వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి గెరిల్లా దాడులు చేస్తున్నారని జగన్ అన్నారు. దానికి ఆర్కే 151 మంది ఎమ్మెల్యేలున్న అధికార పార్టీ మీద ప్రతిపక్షాలకు పోరాడేందుకు బలం సరిపోదు. కాబట్టి గెరిల్లా యుద్ధమే చేయాలి. నిర్వీర్యమైపోయిన వివిధ పాలనావ్యవస్థలు పాలకుడి వద్ద పాలేర్లుగా మారిపోయినప్పుడు ముఖాముఖీ యుద్ధం చేసి ఎవరు మాత్రం నిలవగలరు అంటూ తనదైన వక్రపు వివరణ ఇచ్చారు. అంటే ఆర్కే ప్రతిపక్షాలను న్యాయమైన రీతిలో కాకుండా అడ్డగోలుగా, దాడుల రూపంలో జగన్ మీద పోరాటం చేయమని చెబుతున్నారనే కదా అర్థం. జగన్ గెరిల్లా యుద్ధం చేస్తున్నారని అందం మీదనే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇలా గెరిల్లా యుద్ధం అంటూ మాట్లాడటం సబబు కాదని అన్నారు.
జగన్ అనుమానం వ్యక్తం చేసినందుకే ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడింది అనుకుంటే ఈనాడు ఆర్కే ఏకంగా గెరిల్లా యుద్ధమే చేయాలని, చేయండి అని, వేరే దాది లేదని ప్రతిపక్షాలను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు కాదా. బాధ్యతాయుతమైన మీడియా ఇలా పరోక్ష దాడులకు తెగబడమని నిస్సుగ్గుగా చెప్పడం తప్పు కాదా. ఒకవేళ ఆలయాల మీద దాడుల వెనుక ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కోణమే ఉంటే దాన్ని మరింత పెద్దది చేయమని, ప్రజలను రెచ్చగొట్టమని, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడేలా చేయమని ఆర్కే చెబుతున్నారని అనుకోవాలి. ఈ మాటలను బట్టి ఆర్కే మనసులోని భావాలను ఇట్టే పసిగట్టవచ్చు. ఈ వ్యాఖ్యలతో ఆయన మీద ప్రభుత్వ వ్యతిరేక చర్యలను దగ్గరుండి సమర్థిస్తున్నారని, హింసాత్మక ధోరణిని ప్రోత్సహిస్తున్నారని అరెస్ట్ వరకు వెళ్ళవచ్చు.